ETV Bharat / sports

భారత్​లో జరగాల్సిన ఫుట్​బాల్ ప్రపంచకప్ వాయిదా - FIFA U-17 Women's World Cup In India Postponed

నవంబర్​లో భారత్ వేదికగా జరగాల్సిన అండర్-17 మహిళా ఫుట్​బాల్ ప్రపంచకప్​ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది ఫిఫా. త్వరలోనే కొత్త తేదీలతో ముందుకు వస్తామని తెలిపింది.

FIFA U-17
ఫిఫా
author img

By

Published : Apr 4, 2020, 12:35 PM IST

ఫిఫా అండర్-17 మహిళా ప్రపంచకప్​ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు నిర్వాహకులు. కరోనా మహమ్మారి ప్రభావం కారణంగా వాయిదా వేస్తునట్లు పాలక మండలి తెలిపింది. నవంబర్​లో భారత్ వేదికగా ఈ మెగాటోర్నీ జరగాల్సి ఉంది.

"పాలకమండలి నిర్ణయం మేరకు ఫిఫా అండర్-20 మహిళా ప్రపంచకప్​తో పాటు ఫిఫా అండర్-17 మహిళా ప్రపంచకప్​ను వాయిదా వేస్తున్నాం. త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తాం."

-ఫిపా ప్రకటన

ఫిఫా అండర్​-20 మహిళా ప్రపంచకప్​ పనామా/కోస్టారికాలో ఆగస్టు-సెప్టెంబర్​లో జరగాల్సి ఉంది. అదే విధంగా అండర్-17 మహిళా మెగాటోర్నీ భారత్ వేదికగా నవంబర్ 2-21 మధ్య జరగాల్సి ఉంది. ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు పోటీ పడనున్నాయి. ఆతిథ్యం ఇస్తున్నందుకు భారత్​ కూడా పాల్గొనాల్సి ఉంది. ఇండియా మహిళా జట్టుకు ఇదే తొలి ప్రపంచకప్ కావడం విశేషం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.