ETV Bharat / sports

అతడు కొట్టిన ఫ్రీకిక్​ గోల్​కు జనం ఫిదా

author img

By

Published : May 10, 2020, 7:46 AM IST

మెరుపు గోల్స్‌కు చిరునామా పోర్చుగల్‌ వీరుడు క్రిస్టియానో రొనాల్డో. 2018 ఫిఫా ప్రపంచకప్‌లో స్పెయిన్‌తో పోరులో రొనాల్డో కొట్టిన గోల్‌.. అతడి కెరీర్లోనే అత్యంత ప్రత్యేకమైంది. ఆ గోల్‌ ఎందుకంత విశిష్టమైందంటే..

Cristiano Ronaldo
క్రిస్టియానో రొనాల్డో

2018 ఫిఫా కప్‌లో గ్రూప్‌-బిలో పోర్చుగల్‌కు ఆరంభంలోనే బలమైన స్పెయిన్‌ ఎదురుపడింది.. స్పెయిన్‌ ఊపు మీదే ఉన్నా పోర్చుగల్‌ను ఎవరూ తీసేయలేదు. ఆ అంచనాలకు అనుగుణంగానే సాగింది మ్యాచ్‌.. 4వ నిమిషంలో పెనాల్టీ ద్వారా గోల్‌ చేసి ఖాతా తెరిచాడు రొనాల్డో. కానీ కోస్టా (24వ ని) చేసిన గోల్‌తో స్పెయిన్‌ స్కోరు సమం చేసింది. మళ్లీ రొనాల్డోనే ఆదుకున్నాడు. 44వ నిమిషంలో గోల్‌ చేసి మరోసారి జట్టును ముందంజలో నిలిపాడు. కానీ స్పెయిన్‌ 11 నిమిషాల వ్యవధిలో 2 గోల్స్‌ కొట్టి పోర్చుగల్‌కు సవాల్‌ విరిసింది. సమయం గడుస్తున్న కొద్దీ పోర్చుగల్‌ అభిమానుల్లో ఉత్కంఠ.. స్పెయిన్‌ మద్దతుదారుల్లో ధీమా పెరిగిపోయాయి. మరో రెండు నిమిషాల్లో నిర్ణీత సమయం (90 నిమిషాలు) ముగిసే వేళ.. క్రిస్టియానో మరోసారి పోర్చుగల్‌కు ఆపద్బాంధవుడయ్యాడు.

88వ నిమిషంలో లభించిన ఫ్రీకిక్‌ను గోల్‌గా మలిచి జట్టును రక్షించాడు. అయితే అతను గోల్‌ చేసిన వైనం అద్భుతం. ఫ్రీకిక్‌ కోసం అంతా సిద్ధమయ్యారు.. స్పెయిన్‌ డిఫెండర్లు, గోల్‌కీపర్‌ డేవిడ్‌ గోడలా నిలుచున్నారు. ఇంతటి ఉత్కంఠ మధ్య.. ఒత్తిడిని తట్టుకుంటూ రొనాల్డో బంతిని తన్నాడు. అలా గాల్లోకి లేచిన ఆ బంతి.. ఒక భిన్నమైన కోణంలో ముందుగా డిఫెండర్ల గోడను దాటేసింది.. ఆ తర్వాత కీపర్‌ను బోల్తా కొట్టించింది.. విలాసంగా వెళ్లి నెట్‌లో వాలిపోయింది. క్రిస్టియానో బంతిని కొట్టిన తీరు.. అది వెళ్లిన కోణం.. డిఫెండర్లను, గోల్‌కీపర్‌ను దాటేసిన విధానం.. నెట్‌లోకి ఒదిగిపోయిన దృశ్యం చూసి తీరాల్సిందే. కళ్లు చెదిరే ఆ షాట్‌కు స్టేడియంలో జనం ఫిదా అయిపోయారు. ఓటమి తప్పించుకున్న పోర్చుగల్‌ ఊపిరి పీల్చుకుంది.

ఇదీ చూడండి : అంతర్జాతీయ హాకీ సమాఖ్య చీఫ్ పదవీ కాలం పొడిగింపు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.