ETV Bharat / sports

'టీమ్ఇండియా భవిష్యత్ కెప్టెన్ రోహిత్'

టీమ్ఇండియా కెప్టెన్​ కోహ్లీ (kohli).. భవిష్యత్​లో సారథ్య బాధ్యతల్ని రోహిత్​ శర్మతో కలిసి పంచుకుంటాడని తాను భావిస్తున్నట్లు తెలిపాడు టీమ్​ఇండియా మాజీ వికెట్​కీపర్​ కిరణ్​ మోరె. ఒకవేళ ఇదే కనుక జరిగితే అది భవిష్యత్​ తరాలకు ఓ బలమైన సందేశం అవుతుందని చెప్పాడు. భారత్​ క్రికెట్​ మరింత బలంగా తయారవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

kohli captaincy
కోహ్లీ కెప్టెన్సీ
author img

By

Published : May 27, 2021, 11:27 AM IST

టీమ్ఇండియా విధ్వంసకర ఓపెనర్ రోహిత్​ శర్మ(Rohit Sharma)ను ప్రశంసించాడు టీమ్​ఇండియా మాజీ వికెట్​కీపర్​ కిరణ్​ మోరె​. హిట్​మ్యాన్​ను పరిమిత ఓవర్ల సిరీస్​కు కెప్టెన్​గా నియమించాలని వస్తోన్న వాదనలకు మద్దతు పలికాడు. రోహిత్ భవిష్యత్​లో సారథి అవుతాడని ధీమా వ్యక్తం చేశాడు. త్వరలోనే భారత జట్టు.. ఇంగ్లాండ్​ పర్యటనకు వెళ్లనుండటం, అక్టోబర్​-నవంబరు మధ్యలో జరగబోయే టీ20 ప్రపంచకప్(T20 world cup)​ను దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాఖ్యలు చేశాడు మోరె. మాజీ క్రికెటర్​ ధోనీ సారథ్యంలో కోహ్లీ చాలా నేర్చుకున్నాడన్న మోరే.. భవిష్యత్​లో విరాట్​​ సారథ్య బాధ్యతల్ని పంచుకునే అవకాశముందని చెప్పాడు.

"బోర్డు ఈ విషయాలను పరిగణలోకి తీసుకుంటుందని అనుకుంటున్నా. రోహిత్​ శర్మకు త్వరలోనే సారథ్యం వహించే అవకాశం వస్తుందని భావిస్తున్నా. ధోనీ ఆధ్వర్యంలో కోహ్లీ తెలివగల సారథిగా వృద్ధి చెందాడు. ఎంతకాలం వన్డేలు, టీ20లకు కెప్టెన్​గా ఉండాలని అనుకుంటాడు? అతడు కూడా ఈ విషయమై ఆలోచిస్తాడు. ఇంగ్లాండ్​ పర్యటన తర్వాత దీనిపై స్పష్టత వస్తుంది."

-మోరె, టీమ్​ఇండియా మాజీ వికెట్​కీపర్.

కోహ్లీ.. కెప్టెన్సీ బాధ్యతల్ని రోహిత్(Rohit)​తో పంచుకుంటే భవిష్యత్ తరాలకు ఓ బలమైన సందేశాన్ని ఇచ్చినట్లవుతుందని అన్నాడు మోరె. "భారత్​లో ఒక్కో ఫార్మట్​కు ఒక్కో కెప్టెన్​ అనే పంథా సెట్​ అవుతుంది. టీమ్​ఇండియా భవిష్యత్​ను తీర్చిదిద్దటం ఎంతో ముఖ్యమని సీనియర్​ ఆటగాళ్లు భావిస్తారు. కోహ్లీ (Kohli) ఒక్కడే మంచి ప్రదర్శన చేస్తూ.. మూడు ఫార్మాట్లను నడిపించటం అంత సులువు కాదు. ప్రస్తుతం అతడు కెప్టెన్​గా జట్టును గెలిపిస్తూ బాగానే ఆడుతున్నాడు. అయితే.. 'ఇక చాలు.. రోహిత్ ఇకపై నా బాధ్యతలు పంచుకుంటాడు' అని ఒక రోజు అంటాడని అనుకుంటున్నా.​ తప్పకుండా ఇది మన భవిష్యత్​ తరాలకు ఓ మంచి బలమైన సందేశంగా మారుతుంది. ఏదేమైనప్పటికీ ఇదంతా విరాట్​ మీద అధారపడి ఉంటుంది. అతడు మనిషే కదా, తన మెదడూ అలిసిపోతుంది" అని మోరె వివరించాడు.

ఇంగ్లాండ్​ పర్యటనలో న్యూజిలాండ్​తో జున్​ 18-25 ప్రపంచటెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్ (WTC Final)​, ఇంగ్లీష్​ జట్టుతో ఆగస్టు 4-సెప్టెంబరు 14వరకు టెస్టు సిరీస్​ ఆడనుంది టీమ్​ఇండియా.

ఇదీ చూడండి 'కోహ్లీకి భారంగా అనిపిస్తే సారథ్యం రోహిత్​కు ఇవ్వాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.