ETV Bharat / sports

సూపర్​ బౌలింగ్​.. 1993 రిపీట్​.. అచ్చం షేన్​వార్న్​లానే - Yasir Shah ball of the century

Ball of the century: టెస్టు క్రికెట్​లో 'బాల్​ ఆఫ్​ ది సెంచరీ' అనగానే ముందుగా గుర్తుకొచ్చే పేరు ఆస్ట్రేలియన్​ దిగ్గజం షేన్​ వార్న్​. ఎందుకంటే 1993లో ఆయన ఇంగ్లాండ్​ మాజీ క్రికెటర్​ మైక్​ గ్యాటింగ్​ను ఔట్​ చేసిన తీరును ఎవర్ని మర్చిపోలేరు. మళ్లీ ఇన్నాళ్లకు అటువంటి బంతినే పాకిస్థాన్‌ స్పిన్నర్‌ యాసిర్‌ షా గుర్తుచేశాడు.

Yasir Shah ball of the century
బాల్​ ఆఫ్ ది సెంచరీ
author img

By

Published : Jul 19, 2022, 7:04 PM IST

Ball of the century: 'బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ' ఈ పదం విని ఎన్నిరోజులవుతుందో.. ఎప్పుడో 1993లో ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌వార్న్‌ క్రికెట్‌ ప్రేమికులకు 'బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ' అంటే ఏంటో పరిచయం చేశాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన మొదటి యాషెస్ టెస్టులో ఇంగ్లాండ్‌ వెటరన్ మైక్ గ్యాటింగ్‌ను వార్న్‌ అద్భుతమైన బంతితో క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. గ్యాటింగ్‌తో సహా అంపైర్లు ఆ లెగ్‌ స్పిన్‌ డెలివరీ చూసి ఆశ్చర్యపోయారు.

మళ్లీ ఇన్నాళ్లకు అటువంటి బంతినే పాకిస్థాన్‌ స్పిన్నర్‌ యాసిర్‌ షా గుర్తుచేశాడు. శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో కళ్లు చెదిరే స్పిన్నింగ్‌ డెలివరీతో కుశల్‌ మెండిస్‌ను బోల్తా కొట్టించాడు. శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌ 56 ఓవర్లలో యాసిర్‌షా లెగస్టంప్‌ అవతల వేసిన బంతి..గింగిరాలు తిరుగుతూ ఆఫ్‌ స్టంప్‌ను గిరాటేసింది. దీంతో అప్పటివరకూ చక్కని షాట్లు ఆడుతూ 76 పరుగులతో క్రీజ్‌లో ఉన్న కుశల్ మెండిస్‌ ఆ బంతికి క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. సోషల్‌ మీడియాలో ఈ రెండు ఔట్‌లను పోల్చి చూపుతూ అభిమానులు వీడియాలు పోస్టు చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఆసియా గేమ్స్​ రీషెడ్యూల్​ తేదీలు ఖరారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.