ETV Bharat / sports

WTC Final 2023 : మూడో రోజు ఆట పూర్తి.. 296 పరుగుల ఆధిక్యంలో ఆసీస్‌

WTC Final 2023 : డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. క్రీజ్‌లో లబుషేన్ (41*), కామెరూన్ గ్రీన్ (7*) ఉన్నారు. దీంతో ఆసీస్‌ ఆధిక్యం మొత్తం 296 పరుగులకు చేరింది.

wtc final 2023 third day match completed australia lead runs

author img

By

Published : Jun 9, 2023, 10:44 PM IST

WTC Final 2023 : భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌ మూడో రోజు ఆట పూర్తయింది. రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆసీస్‌.. 44 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. దీంతో 296 పరుగుల ఆధిక్యంలో ఉంది. బ్యాటింగ్‌లో ఖవాజా (13), వార్నర్‌ (1), స్మిత్‌ (34), ట్రావిస్‌ హెడ్‌ (18) పరుగులు చేసి ఔట్‌ అయ్యారు. ప్రస్తుతం క్రీజులో లబుషేన్‌ (41*), కామెరూన్‌ గ్రీన్‌ (7*) ఉన్నారు. భారత బౌలర్లలో జడేజా 2 వికెట్లు, సిరాజ్‌, ఉమేశ్‌ తలో వికెట్‌ తీశారు.

అంతకుముందు.. తొలి ఇన్నింగ్స్​లో ఓవర్‌నైట్‌ 151/5 స్కోరుతో మూడో రోజు ఇన్నింగ్స్‌ను కొనసాగించిన టీమ్ఇండియా మరో 145 పరుగులు జోడించి 296 పరుగులకు ఆలౌటైంది. అజింక్య రహానె (89), శార్దూల్ ఠాకూర్ (51) అర్ధశతకాలు సాధించారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 109 పరుగులు జోడించారు. అయితే, ఆసీస్‌ బౌలర్లు ప్యాట్‌ కమిన్స్ 3, మిచెల్ స్టార్క్ 2, స్కాట్ బోలాండ్ 2, కామెరూన్ గ్రీన్ 2, నాథన్ లైయన్ ఒక వికెట్‌ తీశారు.

మూడో రోజు ఆట తొలి సెషన్‌లో శ్రీకర్‌ భరత్ (5)ను త్వరగా ఔట్‌ చేసిన ఆసీస్‌కు రహానె - శార్దూల్ కొరకరాని కొయ్యలా మారారు. కఠినమైన ఆసీస్‌ బౌలింగ్‌ను ఎదుర్కొని మరీ శతక భాగస్వామ్యం నిర్మించారు. అయితే, రెండో సెషన్‌ ప్రారంభించిన కాసేపటికే రహానెను ఔట్ చేసి వికెట్ల పతనానికి కమిన్స్‌ నాంది పలికాడు. అనంతరం వచ్చిన షమీ (13), ఉమేశ్ (5) క్రీజ్‌లో ఎక్కువసేపు నిలవలేకపోయారు. దీంతో భారత్‌ 296 పరుగులకే ఆలౌటైంది.

ఆస్ట్రేలియా తమ తొలి ఇన్సింగ్స్‌లో 469 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్ (174 బంతుల్లో 25 ఫోర్లు, సిక్స్‌తో 163), స్టీవ్ స్మిత్(268 బంతుల్లో 19 ఫోర్లతో 121) సెంచరీలతో చెలరేగారు. అలెక్స్ క్యారీ (69 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 48), డేవిడ్ వార్నర్ (60 బంతుల్లో 8 ఫోర్లతో 43) విలువైన పరుగులు చేశారు. భారత బౌలర్లలో సిరాజ్‌ నాలుగు వికెట్లకు తోడుగా మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్ తలో రెండు వికెట్లు తీశారు. జడేజాకు ఓ వికెట్ దక్కింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.