World Cup 2023 Semi Final : ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నీలో భారత్, న్యూజిలాండ్ జట్లు తమ జైత్రయాత్రను కొనసాగిస్తున్నాయి. వరుసగా నాలుగు విజయాలతో దూసుకెళ్తున్న ఈ జట్లు మరికొద్ది సేపట్లో ధర్మశాల వేదికగా తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలోనూ తొలి రెండు స్థానాలను ఆక్రమించిన ఈ టీమ్స్..ఇప్పుడు టాప్ ప్లేస్ కోసం పోటీ పడేందుకు సిద్ధమయ్యాయి. అయితే 2023 టోర్నీలో ఇప్పటి వరకు ఓటమి ఎరుగని ఈ రెండు జట్లు.. సెమీ ఫైనల్స్ చేరుకోవడం దాదాపుగా ఖాయమైనట్టే అనిపిస్తోంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప భారత్, న్యూజిలాండ్ సెమీ ఫైనల్స్ రేసు నుంచి తప్పుకోవడం అసాధ్యమని విశ్లేషకులు అంటున్నారు.
లీగ్ దశలో భారత్ మరో నాలుగు మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. న్యూజిలాండ్‌తో మ్యాచ్ తర్వాత రోహిత్ సేన.. ఈ నెల 29న తన తదుపరి మ్యాచ్‌ను ఇంగ్లాండ్‌తో ఆడనుంది. ఆ తర్వాత శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌తో తలపడుతుంది. ఇలా వరుసగా వేర్వేరు జట్లతో పోటీపడి సెమీస్‌కు చేరుకోనుంది టీమ్ఇండియా. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయా జట్లు కూడా కప్‌ను గెలవాలన్న కసితో బరిలోకి దిగుతూ అద్భుతాలు సృష్టిస్తున్నాయి. చిన్న జట్టు అని తేలిగ్గా తీసుకున్న అఫ్గాన్ కూడా ఇంగ్లాండ్‌కు చుక్కలు చూపించింది. దీని బట్టి చూస్తుంటే ఎవ్వరిని తక్కువ అంచనా వేయలేమని అర్థమైంది.
-
Dressing room banter 😉
— BCCI (@BCCI) October 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Shardul Thakur's potential batting promotion 👌
Mohd. Siraj's celebration 😎
Presenting post-match shenanigans ft. Shubman Gill 👌👌 - By @28anand
WATCH 🎥🔽 #CWC23 | #TeamIndia | #INDvBANhttps://t.co/Uzq6h9VLYs
">Dressing room banter 😉
— BCCI (@BCCI) October 20, 2023
Shardul Thakur's potential batting promotion 👌
Mohd. Siraj's celebration 😎
Presenting post-match shenanigans ft. Shubman Gill 👌👌 - By @28anand
WATCH 🎥🔽 #CWC23 | #TeamIndia | #INDvBANhttps://t.co/Uzq6h9VLYsDressing room banter 😉
— BCCI (@BCCI) October 20, 2023
Shardul Thakur's potential batting promotion 👌
Mohd. Siraj's celebration 😎
Presenting post-match shenanigans ft. Shubman Gill 👌👌 - By @28anand
WATCH 🎥🔽 #CWC23 | #TeamIndia | #INDvBANhttps://t.co/Uzq6h9VLYs
ఇక వరుస ఓటములతో సతమతమౌతున్న ఇంగ్లాండ్.. క్రమక్రమంగా తమ ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతోంది. ఈ పరిస్థితుల్లో ఇంగ్లాండ్‌ను ఓడించడం రోహిత్ సేనకు కష్టమైన పని కాదు. ఇక శ్రీలంక, నెదర్లాండ్స్ కూడా అంతంతమాత్రంగానే ఆడుతున్నాయి. అయితే ఈ లీగ్ దశలో టీమ్ఇండియాను భయపెట్టే జట్టు ఏదైనా ఉంది అంటే అది ఒక్క దక్షిణాఫ్రికా మాత్రమే. వారితో ఆడి ఓడిపోయినా కూడా భారత్‌కు పెద్ద నష్టం ఏం జరగదు. లీగ్ దశలో ఆడాల్సిన నాలుగు మ్యాచుల్లో రెండింట్లో నెగ్గినా కూజా సెమీ ఫైనల్స్ వెళ్లే ఛాన్స్ ఉంది.
-
Our 2023 @cricketworldcup squad introduced by their number 1 fans! #BACKTHEBLACKCAPS #CWC23 pic.twitter.com/e7rgAD21mH
— BLACKCAPS (@BLACKCAPS) September 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Our 2023 @cricketworldcup squad introduced by their number 1 fans! #BACKTHEBLACKCAPS #CWC23 pic.twitter.com/e7rgAD21mH
— BLACKCAPS (@BLACKCAPS) September 11, 2023Our 2023 @cricketworldcup squad introduced by their number 1 fans! #BACKTHEBLACKCAPS #CWC23 pic.twitter.com/e7rgAD21mH
— BLACKCAPS (@BLACKCAPS) September 11, 2023
మరోవైపు న్యూజిలాండ్ మాత్రం లీగ్ దశలోనే బలమైన జట్లను ఎదుర్కొవాల్సి ఉంది . దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, శ్రీలంక ఇలా నాలుగింటితో ఆడాల్సి ఉంది. ఇప్పటికే ఆ జట్టుకు కావాల్సినంత నెట్ రన్‌రేట్‌ను అందుబాటులో ఉంది. అయిత్ ఈ జట్టు కూడా లీగ్ దశలో రెండింట్లో గెలిచినా కూడా సెమీ ఫైనల్స్‌లో అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక భారత్, న్యూజిలాండ్‌తో పాటు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలు వరల్డ్ కప్ సెమీస్ చేరుకుంటాయనే అంచనాలు ఉన్నాయి. లీగ్స్‌లో బంగ్లాదేశ్, పాకిస్థాన్, న్యూజిలాండ్, భారత్‌తో ఆడనున్న దక్షిణాఫ్రికా.. కనీసం రెండు మ్యాచుల్లోనైనా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.
-
🇿🇦 RAISE YOUR FLAG
— Proteas Men (@ProteasMenCSA) October 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
A statement win for the Proteas as they a notch 229 victory over England 🏏
One down on to you @Springboks🇿🇦 we are fully behind YOU 🫂 #CWC23 #BePartOfIt pic.twitter.com/P2WYANYfwo
">🇿🇦 RAISE YOUR FLAG
— Proteas Men (@ProteasMenCSA) October 21, 2023
A statement win for the Proteas as they a notch 229 victory over England 🏏
One down on to you @Springboks🇿🇦 we are fully behind YOU 🫂 #CWC23 #BePartOfIt pic.twitter.com/P2WYANYfwo🇿🇦 RAISE YOUR FLAG
— Proteas Men (@ProteasMenCSA) October 21, 2023
A statement win for the Proteas as they a notch 229 victory over England 🏏
One down on to you @Springboks🇿🇦 we are fully behind YOU 🫂 #CWC23 #BePartOfIt pic.twitter.com/P2WYANYfwo
ఆస్ట్రేలియా కూడా దాదాపుగా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. అయిదు మ్యాచ్‌లు మాత్రమే ఆ జట్టు చేతిలో ఉన్నాయి. నెదర్లాండ్స్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లతో ఆసిస్ తలపడనుంది. అయితే సెమీస్ చేరాలంటే మాత్రం ఈ జట్టు కనీసం మూడింట్లో నెగ్గాల్సి ఉంటుంది. నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌లపై ఆసీస్ గెలిచే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి. అదే జరిగితే ఆస్ట్రేలియా జట్టు సెమీస్ చేరే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. దీంతో ఈ నాలుగు జట్లు కాదని మరొకటి రేసులోకి రావడం దాదాపుగా అసాధ్యమే అని అంచనాలు కూడా ఉన్నాయి.
-
What a win! We get the better of Pakistan by 62 runs which takes us into the top four for the first time this World Cup! Come on you Aussies! 🇦🇺 #CWC23 pic.twitter.com/xeHkyuxeNA
— Cricket Australia (@CricketAus) October 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">What a win! We get the better of Pakistan by 62 runs which takes us into the top four for the first time this World Cup! Come on you Aussies! 🇦🇺 #CWC23 pic.twitter.com/xeHkyuxeNA
— Cricket Australia (@CricketAus) October 20, 2023What a win! We get the better of Pakistan by 62 runs which takes us into the top four for the first time this World Cup! Come on you Aussies! 🇦🇺 #CWC23 pic.twitter.com/xeHkyuxeNA
— Cricket Australia (@CricketAus) October 20, 2023
మరోవైపు ఇంగ్లాండ్ ఆడుతున్న తీరు కూడా దారుణంగా ఉంది. వరుస ఓటములతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి దిగజారింది ఆ జట్టు. పాకిస్థాన్ ఆటతీరు కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు. ఈ రెండు జట్లూ సెమీస్ రేసులో నిల్చోవాలంటే ఆడే ప్రతి మ్యాచ్‌నూ భారీ తేడాతో నెగ్గాల్సి ఉంటుంది.
Ind Vs NZ World Cup : కివీస్‌తో కీలక పోరు.. ఈ ముగ్గురు మొనగాళ్లను అడ్డుకుంటారా ?