World Cup 2023 Ind vs Aus : 2023 వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. మరి కొన్ని గంటల్లోనే ఈ మెగాటోర్నీలో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. చెన్నై వేదికగా భారత్.. ఆదివారం పటిష్ఠమైన ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. అయితే రీసెంట్గా స్వదేశంలో కంగారులతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లోనూ అదే జోరుతో అసీస్‌ను ఓడించి.. టోర్నీని ఘనంగా ఆరంభించాలని రోహిత్ సేన భావిస్తోంది. కానీ ఆసీస్‌ను ఇలాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో తీసిపారేయలేం.
ఐదుసార్లు విశ్వకప్ విజేత ఆస్ట్రేలియా.. ప్రతి ఎడిషన్‌లో టైటిల్ ఫేవరెట్‌గానే బరిలో దిగుతోంది. ఈ టోర్నీలో ఆసీస్.. భిన్నంగా కనిపిస్తే ఆశ్చర్యమేమీ లేదు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ నుంచి కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వరకు అందరూ అవసరమైనప్పుడల్లా.. అటు బ్యాట్, ఇటు బంతితో రాణించగలరు. అలాగే వార్నర్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, లబుషేన్ ఈ మధ్య మంచి ఫామ్‌లో ఉన్నారు. వారిని బుమ్రా, సిరాజ్ ఆరంభంలో.. మధ్య ఓవర్లలో కుల్‌దీప్, జడేజా, అశ్విన్ కంగారూ బ్యాటర్లను బాగానే ఇబ్బంది పెట్టగలిగితే మ్యాచ్‌లో టీమ్ఇండియా పైచేయి సాధించవచ్చు.
ఆశలు వారిపైనే.. కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌పై టీమ్ఇండియా ప్రధానంగా ఆధారపడింది. ఇక గాయం ,నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్.. మిడిలార్డర్లో కీలక రాణించాల్సిన అవసరం ఉంది. రీసెంట్గా అతడు ఆసీస్‌పై సెంచరీ చేసి ఫామ్ చాటుకున్నాడు.అదే జోరును ఈ మ్యాచ్‌లోనూ కొనసాగిస్తే.. విజయం పక్కా భారత్‌దే.
స్పిన్నర్లకే కలిసొస్తుందా?
చెన్నై చెపాక్ స్టేడియం పిచ్.. స్పన్నర్లకే అనకూలం అని తెలుస్తోంది. దీంతో భారత్.. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవాకాశం ఉంది. ఈ క్రమంలో జడేజా, కుల్‌దీప్, అశ్విన్ తుది జట్టులో ఉండవచ్చు. అశ్విన్.. ఇటీవల వన్డే సిరీస్‌లో ఆసీస్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. పైగా చెపాక్ అశ్విణ్ సొంత మైదానం కూడా. ఇక ఈ గ్రౌండ్లో పెద్ద స్కోర్లు ఖాయమని విశ్లేషకులు అంటున్నారు.
-
One sleep away ⏳
— BCCI (@BCCI) October 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Our #CWC23 Journey begins tomorrow 👏
Send in your wishes for #TeamIndia 🇮🇳 👇 pic.twitter.com/eNcN6WG5P9
">One sleep away ⏳
— BCCI (@BCCI) October 7, 2023
Our #CWC23 Journey begins tomorrow 👏
Send in your wishes for #TeamIndia 🇮🇳 👇 pic.twitter.com/eNcN6WG5P9One sleep away ⏳
— BCCI (@BCCI) October 7, 2023
Our #CWC23 Journey begins tomorrow 👏
Send in your wishes for #TeamIndia 🇮🇳 👇 pic.twitter.com/eNcN6WG5P9
తుది జట్లు (అంచనా)...
భారత్: రోహిత్ (కెప్టెన్), ఇషాన్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, హార్దిక్, జడేజా, కుల్‌దీప్, అశ్విన్/షమి, బుమ్రా, సిరాజ్.
ఆస్ట్రేలియా: వార్నర్, మిచెల్ మార్ష్, స్మిత్, లబుషేన్, మ్యాక్స్‌వెల్, కేరీ, గ్రీన్, కమిన్స్ (కెప్టెన్), స్టార్క్, హేజిల్‌వుడ్, జంపా