ETV Bharat / sports

దక్షిణాఫ్రికా వేదికగా 'అండర్-​19 ఉమెన్స్​ టీ20 వరల్డ్​ కప్​'

Under-19 Women's T20 World Cup: మహిళల తొలి అండర్​-19 టీ20 ప్రపంచ కప్​ దక్షిణాఫ్రికా వేదికగా జరగనుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది ఐసీసీ. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ మెగా టోర్నీ కొత్త తేదీలను ఆదివారం ముగిసిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఖరారు చేశారు. మరోవైపు.. వచ్చే ఏడాది జరగనున్న మహిళల ప్రపంచ కప్​ సైతం దక్షిణాఫ్రికాలోనే జరుగుతుండటం విశేషం

author img

By

Published : Apr 11, 2022, 1:44 PM IST

Under-19 Womens T20 World Cup in 2023
దక్షిణాఫ్రికా వేదికగా 'అండర్-​19 వుమెన్స్​ టీ20 వరల్డ్​ కప్​'

Under-19 Women's T20 World Cup: మహిళా క్రికెట్​ను మరో మెట్టు ఎక్కించేందుకు అండర్​-19 ఉమెన్స్​ టీ20 వరల్డ్​ కప్​ టోర్నీ నిర్వహిస్తోంది ఐసీసీ. 2023లో జరగనున్న ఈ తొలి టీ20 మెగా టోర్నీని దక్షిణాఫ్రికాలో నిర్వహించనున్నట్లు తాజాగా ఐసీసీ వెల్లడించింది. ఇందులో 16 జట్లు పాల్గొననుండగా.. తొలి టోర్నీలోనే విశ్వవిజేతగా నిలిచేందుకు టాప్​ జట్లతో పాటు చిన్న జట్లు సైతం పోటీ పడేందుకు సిద్ధమవుతున్నాయి.

అండర్​-19 ఉమెన్స్​ టీ20 ప్రపంచ కప్​ను ముందుగా 2021లోనే నిర్వహించాలని నిర్ణయించింది ఐసీసీ. అయితే.. కొవిడ్​-19 మహమ్మారి కారణంగా ఈ మెగా టోర్నీని వాయిదా వేసింది ఐసీసీ. ఏప్రిల్​ 10న జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ టోర్నీ నిర్వహించే కొత్త తేదీలను ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ ఈవెంట్​లో మొత్తం 41 మ్యాచ్​లు ఉండనుండగా.. వచ్చే ఏడాది జనవరిలోనే నిర్వహించనున్నట్లు తెలిపింది ఐసీసీ.

రెండు నెలల్లో రెండు మెగా టోర్నీలు: ఐసీసీ ఉమెన్స్​ టీ20 ప్రపంచ కప్​ సైతం 2023 ఫిబ్రవరి 9న ప్రారంభం కానుంది. అది కూడా దక్షిణాఫ్రికాలోనే నిర్వహిస్తుండటం విశేషం. అంటే కేవలం రెండు నెలల వ్యవధిలోనే రెండు ఐసీసీ మెగా టోర్నీలకు దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇవ్వనుంది. రెండు టోర్నీలను విజయవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు దక్షిణాఫ్రికా క్రికెట్​ బోర్డ్​ చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ ఫొలెట్సి మొసెకి. ' ఇది చాలా అద్భుతమైన విషయం. దక్షిణాఫ్రికాపై ఐసీసీ పెట్టుకున్న నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈమెగా టోర్నీలను విజయవంతంగా పూర్తి చేసేందుకు అందరి సమన్వయంతో కృషి చేస్తాం. అండర్​-19 ఉమెన్స్​ టీ20 ప్రపంచ కప్​ కోసం క్రికెట్​ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.' అని పేర్కొన్నారు.

గత కొన్నేళ్లుగా మహిళల క్రికెట్​కు మంచి ఆదరణ లభిస్తోంది. ఇటీవల జరిగిన మహిళల ప్రపంచ కప్​-2022లో అద్భుత ప్రదర్శనతో ట్రోఫీని ఎగరేసుకుపోయింది ఆస్ట్రేలియా. ఈ టోర్నీలోని కొన్ని ఉత్కంఠభరితమైన మ్యాచ్​లు అభిమానులను ఉర్రూతలూగించాయి. ఈ టోర్నీలో భారత్​ గ్రూప్​ దశలోనే నిష్క్రమించటం అభిమానుల్లో కాస్త నిరాశను కలిగించింది.

ఇదీ చూడండి: మహిళా క్రికెట్​కు కొత్త వన్నెలు తెచ్చిన సారథులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.