ETV Bharat / sports

'బాల్ టాంపరింగ్ వివాదంపై వార్నర్ బుక్ రాయాలి' - వార్నర్ గురించి స్టువర్ట్ బ్రాడ్

ఆస్ట్రేలియా బాల్ టాంపరింగ్ వివాదంపై స్పందించాడు ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్. ఈ వివాదంపై డేవిడ్ వార్నర్ పుస్తకం రాస్తే బాగుంటుందని తెలిపాడు.

Broad
బ్రాడ్
author img

By

Published : May 18, 2021, 12:35 PM IST

ఆస్ట్రేలియా క్రికెట్లో పెను ప్రకంపనలు రేపిన బాల్‌ టాంపరింగ్‌ ఉదంతం చోటు చేసుకుని మూడేళ్లు దాటిపోయింది. ఇప్పుడు మళ్లీ ఆ ఉదంతంపై చర్చకు తెరలేపాడు బాన్‌క్రాఫ్ట్‌. అలాగే ఈ వివాదంపై క్రికెట్ ఆస్ట్రేలియా సరైన రీతిలో దర్యాప్తు చేపట్టలేదని విమర్శించాడు డేవిడ్​ వార్నర్​ మేనేజర్​ జేమ్స్​ ఎర్​స్కైన్​. ఆటగాళ్లందరినీ విచారించకుండా ఆసీస్​ బోర్డు ఏకపక్ష నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడ్డాడు. తాజాగా ఈ విషయంపై స్పందించాడు ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్. ఈ వివాదం కారణంగా శిక్ష అనుభవించిన డేవిడ్ వార్నర్ దానిపై ఓ పుస్తకం రాస్తే బాగుంటుందని అతడు తెలిపాడు.

"బాల్ టాంపరింగ్ వివాదంపై డేవిడ్ వార్నర్ ఏజెంట్​ చేసిన వ్యాఖ్యలు విన్నా. ఆస్ట్రేలియా జట్టుకు రిటైర్మెంట్ ప్రకటించాక వార్నర్ దీనిపై ఓ పుస్తకం రాస్తే ఎలా ఉంటుందో చూడాలని ఉంది. ఈ వివాదం ముగిసిపోయిందని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు భావించింది. కానీ శిక్ష పడిన ఆ ముగ్గురు ఆటగాళ్లకు దీని నుంచి బయటపడటం చాలా కష్టం."

-స్టువర్ట్ బ్రాడ్, ఇంగ్లాండ్ బౌలర్

ఈ వివాదంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గిల్​క్రిస్ట్ స్పందిస్తూ విచారణ సరిగా జరగలేదని తెలిపాడు. "సమస్య మూలాల్లోకి వెళ్లి సమగ్రమైన విచారణ చేపట్టడం ద్వారా ఒక బలమైన సందేశాన్ని ఇవ్వడానికి అప్పుడు అవకాశం లభించింది. కానీ సీఏ ఆ లోతుల్లోకి వెళ్లాలనుకోలేదు. ఈ సమస్య వ్యవస్థీకృతం అయిందా అని విచారించే ప్రయత్నం చేయలేదు. ఆ ఉదంతం తర్వాత ప్రపంచ క్రికెట్లో రివర్స్‌ స్వింగ్‌ బాగా తగ్గిపోయింది. ఆటగాళ్లపై శిక్షలు పడటం వల్ల జరిగిన మంచి పరిణామం ఇది" అని గిల్లీ అన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.