ETV Bharat / sports

'అతడిని తొందరగా ఔట్ చేయాలి.. లేదంటే?' - డబ్ల్యూసీ ఫైనల్ ఉమేశ్ యాదవ్

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్​ ఫైనల్ కోసం సిద్ధమవుతున్నట్లు తెలిపాడు టీమ్ఇండియా పేసర్ ఉమేశ్ యాదవ్. న్యూజిలాండ్ ప్రమాదకరమైన జట్టని వెల్లడించాడు.

Umesh Yadav
ఉమేశ్ యాదవ్
author img

By

Published : May 19, 2021, 9:02 AM IST

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)ఫైనల్‌లో భారత్ మ్యాచ్‌పై పట్టుబిగించాలంటే ముందుగా బౌలర్లు వీలైనంత తొందరగా కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను ఔట్‌ చేయాలని టీమ్ఇండియా పేసర్ ఉమేశ్‌ యాదవ్‌ అభిప్రాయపడ్డాడు. ఇలా చేయడం వల్ల భారత్‌కు ఎంతో ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నాడు.

"న్యూజిలాండ్‌ పటిష్టమైన జట్టు. వారి బ్యాటింగ్‌ లైనప్‌ బాగుంది. కివీస్‌ బౌలర్లు చాలా అనుభవజ్ఞులే కాకుండా ప్రమాదకరమైనవారు. కాబట్టి వారితో జరిగే ఈ పోరు కఠినంగానే ఉంటుంది. ఇంగ్లాండ్ వాతావరణ పరిస్థితులకు అలవాటు పడటం మాకు పెద్ద సవాలే. అది కూడా న్యూజిలాండ్ లాంటి జట్టుతో ఆడటం. టెస్టు ఆటగాళ్లు ఎంతో క్రమశిక్షణతో ఆడాలి. ప్రతి సెషన్‌లో దాన్ని కొనసాగించిన జట్టే విజేతగా నిలుస్తుంది. విలియమ్సన్‌ ఆటతీరు గురించి మాకు మంచి అవగాహన ఉంది. అతడు మంచి బ్యాట్స్‌మన్‌. అయితే, ఎంత గొప్ప ఆటగాడైనా ఓ మంచి బంతికి ఔట్‌ కావొచ్చు. మన సామర్థ్యాలను నమ్ముకుని వికెట్లు రాబట్టగలిగే బంతులనే ఎక్కువగా వేయాలి. విలియమ్సన్‌ను సాధ్యమైనంత త్వరగా ఔట్‌ చేయడం వల్ల టీమ్ఇండియాకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది"

-ఉమేశ్‌ యాదవ్‌, టీమ్ఇండియా పేసర్

సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18-22 మధ్య భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్ జరగనుంది. కేన్‌ విలియమ్సన్‌ సారథ్యంలోని కివీస్‌ జట్టు ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకుంది. ముందుగా అతిథ్య జట్టుతో రెండు టెస్టులు ఆడనుంది. టీమ్ఇండియా కూడా ఈ పర్యటనకు సిద్ధమైంది. బుధవారం ఆటగాళ్లు, కుటుంబసభ్యులు ముంబయిలో ఒక్కచోటికి చేరనున్నారు. అక్కడ క్వారంటైన్‌ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ పయనమవుతారు. అక్కడ కూడా కఠిన క్వారంటైన్‌లో ఉండనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.