Warner Top 5 Underrated Test Innings: ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ టెస్టు కెరీర్ ముగిసింది. శుక్రవారం (జనవరి 6) పాకిస్థాన్‌తో ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడిన వార్నర్‌కు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఘనమైన ఫేర్వెల్ దక్కింది. మ్యాచ్ అనంతరం వార్నర్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. కెరీర్లో తనకు తోడుగా ఉన్న టీమ్‌మేట్స్‌కు, భార్య కాండిస్‌కు వార్నర్ స్పెషల్ థాంక్స్ చెప్పాడు. ఇక ఈ మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ బాది ఫ్యాన్స్‌ను అలరించాడు వార్నర్. అయితే 13 ఏళ్ల వార్నర్ టెస్టు కెరీర్లో అతడు అంచనాలకు మించి రాణించిన 5 ఇన్నింగ్స్ చూద్దాం.
-
Heartwarming from Pakistan 👏#WTC25 pic.twitter.com/75oBNaD0nc
— ICC (@ICC) January 6, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">Heartwarming from Pakistan 👏#WTC25 pic.twitter.com/75oBNaD0nc
— ICC (@ICC) January 6, 2024Heartwarming from Pakistan 👏#WTC25 pic.twitter.com/75oBNaD0nc
— ICC (@ICC) January 6, 2024
- 123* vs న్యూజిలాండ్ (2011): 2011లో వార్నర్ కెరీర్లో రెండో టెస్టు ఆడాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ విజయానికి 241 పరుగులు అవసరమయ్యాయి. అయితే ఈ మ్యాచ్‌లో కివీస్ బౌలర్ బ్రేస్‌వెల్ దెబ్బకు ఆసీస్ 233 పరుగులకు కుప్పకూలింది. కానీ, ఆసీస్ సాధించిన 233 పరుగుల్లో 25 ఏళ్ల వార్నర్ ఒక్కడే 123 స్కోర్ చేశాడు. దీంతో యావత్ క్రీడాలోకం దృష్టిని వార్నర్ తనవైపు తిప్పుకున్నాడు.
- 135 vs సౌతాఫ్రికా (2014): ఈ సిరీస్‌లో కేప్‌టౌన్‌లో జరిగిన మ్యాచ్‌లో వార్నర్ రెండు ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు. వార్నర్ వరుస ఇన్నింగ్స్‌ల్లో 135, 152 భారీ స్కోర్లు నమోదు చేశాడు. ఫలితంగా ఆసీస్‌కు భారీ ఆధిక్యం దక్కింది. దీంతో ఈ మ్యాచ్‌లో నెగ్గడమే కాకుండా, ఆసీస్ 2-1 తేడాతో సిరీస్‌ను గెలుచుకుంది.
- 116 vs న్యూజిలాండ్ (2015): 2015 న్యూజిలాండ్‌తో బ్రిస్బెన్లో జరిగిన మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ వార్నర్ శతకాలు బాదాడు. తొలి ఇన్నింగ్స్‌లో 163 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 116 పరుగులు చేశాడు. దీంతో ఈ మ్యాచ్‌లో ఆసీస్, కివీస్ ముంగిట 504 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది.
- 115 vs సౌతాఫ్రికా (2014): 2014లో వార్నర్ టెస్టుల్లో అదరగొట్టాడు. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భాగంగా సెంచూరియన్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 281 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ మ్యాచ్‌లో వార్నర్ తన జట్టుకు భారీ ఆధిక్యం కట్టబెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. అతడు 151 బంతుల్లో 115 పరుగులు చేశాడు.
- 112 vs బంగ్లాదేశ్ (2017): 2017లో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ 1-1తో డ్రా గా ముగిసింది. అయితే రెండు మ్యాచ్‌ల్లోనూ సెంచరీతో అదరగొట్టిన వార్నర్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది. ముఖ్యంగా వార్నర్ రెండో మ్యాచ్‌లో నమోదు చేసిన సెంచరీ సిరీస్‌కే హైలైట్‌గా నిలిచింది. 265 పరుగుల లక్ష్య ఛేదనలో వార్నర్ 135 బంతుల్లో 112 పరుగులు చేశాడు. కానీ, ఆ మ్యాచ్‌లో వార్నర్‌కు మరోఎండ్‌లో సహకారం కరవైంది. దీంతో ఆసీస్ 244 పరుగులకు ఆలౌటైంది.
పాకిస్థాన్‌ను వైట్‌వాష్ చేసిన ఆస్ట్రేలియా- చివరి ఇన్నింగ్స్‌లో వార్నర్ హాఫ్ సెంచరీ