Virat Kohli Yo Yo Test : మరికొద్దిరోజుల్లో ప్రారంభమవ్వనున్న ఆసియా కప్ కోసం టీమ్ఇండియా సన్నద్ధమవ్వుతోంది. ఈ క్రమంలో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. జాతీయ క్రికెట్ అకాడమీలో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తాజాగా అలూరులో నిర్వహించిన యో-యో టెస్టును కూడా విరాట్ క్లియర్ చేశాడు. ఈ క్రమంలో యో-యో టెస్టులో పాసయ్యానని, 17.2 స్కోర్ సాధించినట్లు సోషల్ మీడియా వేదికగా కోహ్లీ వెల్లడించాడు. దీంతో విరాట్ ఫుల్ స్ట్రాంగ్ అంటూ అభిమానులు పోస్టులు పెట్టారు.
బీసీసీఐ సీరియస్!
BCCI On Virat : అయితే విరాట్ పెట్టిన పోస్ట్‌ను బీసీసీఐ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. జట్టుకు సంబంధించిన అంతర్గత విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని కోహ్లీకి బీసీసీఐ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. కోహ్లీ యో-యో టెస్టుకు సంబంధించిన స్కోర్‌ను పోస్ట్ చేయడం బీసీసీఐ అపెక్స్ బాడీ ఉన్నతాధికారులకు ఏ మాత్రం నచ్చలేదని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. మరోసారి ఇలా అలా చేయొద్దంటూ హెచ్చరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
"టీమ్ఇండియా జట్టుకు సంబంధించిన రహస్య సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయకూడదని ఆటగాళ్లను హెచ్చరించాం. వారు తమ ట్రైనింగ్ సంబంధించిన ఫొటోలను షేర్ చేసుకోవచ్చు. కానీ వారి స్కోర్‌లను, అంతర్గత విషయాలను బహిర్గతం చేయకూడదు. అది వారి కాంట్రాక్ట్ నిబంధనలకు విరుద్దం" అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.
రోహిత్, హార్దిక్ పాస్.. మరి రాహుల్?
Rohith Sharma Yo Yo Test : తాజాగా టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యతో పాటు మిగితా సభ్యులు కూడా యో-యో టెస్టులో పాసైనట్లు తెలుస్తోంది. అయితే వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మాత్రం ఈ ఫిట్‌నెస్ టెస్టుకు దూరంగా ఉన్నట్లు సమాచారం. అతడు ప్రస్తుతం మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. కేఎల్ ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి మరికొంత సమయం పట్టనున్నట్లు టీమ్ఇండియా ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సైతం చెప్పుకొచ్చాడు.
Asia Cup 2023 : ఆసియాకప్-2023కు మరో ఐదు రోజుల్లో తెరలేవనుంది. ఆగస్టు 30న ముల్తాన్ వేదికగా జరగనున్న పాకిస్థాన్- నేపాల్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. మొత్తం ఈ ఈవెంట్‌లో ఆరు జట్లు పాల్గొనబోతున్నాయి. పాకిస్థాన్, నేపాల్, భారత్ జట్లు గ్రూపు-ఏ లో ఉండగా.. అఫ్గానిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ గ్రూపు-బిలో ఉన్నాయి. అయితే నేపాల్ జట్టు తొలిసారి ఆసియాకప్‌కు అర్హత సాధించింది.
Ajit Agarkar About Virat Kohli : పాక్ బౌలర్ల సంగతా? విరాట్ వారి లెక్కలు తేలుస్తాడులే!