Virat Kohli World Cup 2023 : ఓ పరిపూర్ణమైన బ్యాటర్ కావడంపై దృష్టి పెట్టడం కంటే కొత్త షాట్లు నేర్చుకోవడం మేలని అంటున్నాడు టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి. న్యూజిలాండ్‌తో దాదాపుగా ఖాయమైన సెమీఫైనల్ పోరు కోసం సిద్ధమౌతున్న నేపథ్యంలో కోహ్లి ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు.
"టెక్నిక్, స్కిల్‌ను మెరుగుపరుచుకోవడంలో రెండు విషయాలు ఉంటాయి. ఒకటి నేర్చుకున్న టెక్నిక్ మ్యాచ్‌లు గెలవడానికి ఉపయోగించడం.. లేకుంటే బ్యాటింగ్ మెరుగుపరచుకోవడం. బ్యాటింగ్‌లో మెరుగుపడటం అనే విషయం గురించి చాలామందికి అవగాహన ఉండదు. మన బ్యాటింగ్‌కు ఇంకా ఏం చేరిస్తే గెలుపు కోసం కృషి చేయచ్చు అని ఆలోచిస్తే మన ఆట మెరుగవుతుంది. ఈ క్రమంలో పరిపూర్ణమైన బ్యాటర్ కావడంపై ఫోకస్ చేయడం కంటే కొత్త షాట్లు నేర్చుకోవడం మంచిదని నా అభిప్రాయం. దీని వల్ల పరుగులు వస్తాయి.. జట్టు గెలుస్తుంది" అని విరాట్ పేర్కొన్నాడు.
గతేడాది టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పేసర్ హారిస్ రవూఫ్ బౌలింగ్‌లో విరాట్ నేరుగా కొట్టిన సిక్సర్‌ని అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. "రవూఫ్ బౌలింగ్‌లో కొట్టిన ఆ సిక్సర్‌ను చాలాసార్లు చూశాను. ఎంతో ప్రత్యేకమైన సమయం అది. ఈ రోజు వరకు ఆ షాట్ ఎలా ఆడానో నాకే తెలియదు" అని కోహ్లి పేర్కొన్నాడు.
వాళ్ల కోసం కఠిన ప్రాక్టీస్..
సెమీస్‌కు సిద్ధమౌతున్న నేపథ్యంలో శుక్రవారం జరిగిన శిక్షణలో భాగంగా కోహ్లి.. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్‌ను ఎక్కువగా ఎదుర్కొన్నాడు. 2021 నుంచి లెఫ్ట్‌ఆర్మ్ స్పిన్నర్లపై కోహ్లి సగటు 13 మాత్రమే. ఈ నేపథ్యంలో జడేజా బౌలింగ్‌లో విరాట్ వీలైనంత ఎక్కువసేపు ప్రాక్టీస్ చేశాడట.
Virat Kohli Shot Of The Century : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ కింగ్ విరాట్ కోహ్లి మరో కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు క్రికెట్ చరిత్రలోనే మరే బ్యాటర్ సాధించని ఘనతను కోహ్లీ అందుకున్నాడు. దీనిని స్వయంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) వెల్లడించింది. గతేడాది(2022) ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ మైదానంలో పాకిస్థాన్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కొట్టిన ఓ సిక్స్‌ను.. ఈ శతాబ్దంలోనే మేటి షాట్ (షాట్ ఆఫ్ ది సెంచరీ)గా ఐసీసీ ప్రకటించింది.
రెండో బిడ్డకు జన్మనివ్వనున్న విరుష్క జంట - బేబి బంప్ వీడియో వైరల్!
విరాట్ టు వార్నర్- ప్రపంచ కప్‌లో టాప్ -5 బ్యాటర్లు వీరే!