ETV Bharat / sports

విరాట్ కోహ్లీ అరుదైన ఘనత.. క్రికెట్ చరిత్రలోనే ఒకే ఒక్కడిగా! - విరాట్​ కోహ్లీ తాజా వార్తలు

భారత్​ క్రికెట్​ జట్టు మాజీ సారథి విరాట్​ కోహ్లీ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐసీసీ టెస్ట్, వన్డే, టీ20 జట్టుల్లో భాగమైన ఏకైక ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆ వివరాలు..

kohli
kohli
author img

By

Published : Jan 23, 2023, 10:06 PM IST

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఐసీసీ టెస్ట్ టీమ్, వన్డే టీమ్, టీ20 జట్టుల్లో భాగమైన ఏకైక ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ప్రతీ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో ఐసీసీ బెస్ట్ ఎలెవెన్‌ను ఎంపిక చేస్తూ ఉంటోంది. గతంలోనే ఐసీసీ టెస్ట్ టీమ్, వన్డే టీమ్‌ల్లో పలుమార్లు చోటు దక్కించుకున్న విరాట్.. టీ20 టీమ్‌‌కు ఎంపికవ్వడానికి మాత్రం టైమ్ తీసుకున్నాడు. గతేడాది అసాధారణ ప్రదర్శన కనబర్చిన కింగ్ కోహ్లీ.. ఆ ముచ్చట కూడా తీర్చుకున్నాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన 2022 అత్యుత్తమ జట్టులో విరాట్‌ కోహ్లీకి చోటు దక్కింది. దాంతో క్రికెట్ చరిత్రలోనే మూడు ఫార్మాట్లకు చెందిన ఐసీసీ బెస్ట్ ఎలెవెన్స్‌లో చోటు దక్కించుకున్న ప్లేయర్‌గా విరాట్ నిలిచాడు.

జట్టులో చోటే కష్టమన్న పరిస్థితుల నుంచి..
కోహ్లీ 2022 జూలై వరకు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాడు. పేలవ ఫామ్‌తో జట్టులో చోటే కోల్పోతాడని ప్రచారం జరిగింది. నెల రోజుల పాటు ఆటకు దూరమైన విరాట్.. ఆసియాకప్ 2022తో రీఎంట్రీ ఇచ్చాడు. అఫ్గానిస్థాన్‌పై సెంచరీ బాది.. మూడేళ్ల నిరీక్షణకు తెరదించాడు. అక్కడి నుంచి విరాట్ జోరు కొనసాగుతూనే ఉంది. ఆసియాకప్‌లో ఐదు ఇన్నింగ్స్‌ల్లో 276 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. టీ20 ప్రపంచకప్‌లో 296 పరుగులతో హయ్యెస్ట్ రన్నర్‌గా నిలిచాడు. పాకిస్థాన్‌పై విరాట్(82 నాటౌట్‌) చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు.

ఐసీసీ అవార్డులన్నీ..
ఐసీసీ అవార్డులన్నీ గెలిచిన ఏకైక ప్లేయర్‌గా విరాట్ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టెస్ట్ టీమ్ కెప్టెన్‌గా మూడు సార్లు నిలిచిన కోహ్లీ.. వన్డే కెప్టెన్‌గా నాలుగు సార్లు నిలిచాడు. స్పిరిట్ ఆఫ్ క్రికెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. దశాబ్దపు క్రికెటర్‌గా.. వన్డే క్రికెటర్ ఆఫ్ ది డికేడ్‌గా కూడా చరిత్రకెక్కాడు.

క్రికెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డును రెండుసార్లు గెలుచుకున్న విరాట్.. టెస్ట్ క్రికెట్ ఆఫ్ ద ఇయర్‌గా ఒకసారి, వన్డే ఆఫ్ ద క్రికెటర్‌గా మూడు సార్లు నిలిచాడు. టెస్ట్, వన్డే, టీ20 టీమ్ ఆఫ్ ద డికేడ్, టెస్ట్ టీమ్ కెప్టెన్ ఆఫ్ డికేడ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. మూడు ఫార్మాట్లలో కలిపి ఇప్పటికీ 10 సార్లు ఐసీసీ అత్యుత్తమ ఇయర్ టీమ్స్‌లో విరాట్ భాగమయ్యాడు.

2023లోనూ కింగ్ కోహ్లీనే..
ఈ ఏడాది కూడా విరాట్ కోహ్లీ తన జోరును కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే రెండు సెంచరీలు బాదాడు. శ్రీలంకతో తొలి వన్డేలో 113 పరుగులు చేసిన విరాట్.. చివరి వన్డేలో 166 పరుగులతో అజేయంగా నిలిచాడు. న్యూజిలాండ్‌తో తొలి రెండు వన్డేల్లో విఫలమైన విరాట్.. కాన్పుర్ వేదికగా జరిగే ఆఖరి వన్డేలో భారీ స్కోర్‌పై కన్నేశాడు. ఈ సిరీస్ అనంతరం టీ20 సిరీస్‌కు దూరంగా ఉండనున్న కోహ్లీ.. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బరిలోకి దిగనున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.