Kohli Dravid Record: ద్రవిడ్ రికార్డుపై కన్నేసిన విరాట్ - ద్రవిడ్ రికార్డుపై కన్నేసిన కోహ్లీ
Kohli Dravid Record: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ను ఎలాగైనా కైవసం చేసుకోవాలని భారత జట్టు ఆత్రుతగా ఎదురుచూస్తోంది. కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో అందుకు తగ్గట్లే శ్రమిస్తున్నారు ఆటగాళ్లు. అయితే ఈ సిరీస్ ద్వారా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ రికార్డును తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది. అదేంటంటే!
![Kohli Dravid Record: ద్రవిడ్ రికార్డుపై కన్నేసిన విరాట్ Virat Kohli record, kohli eyes on dravid record, కోహ్లీ రికార్డు, ద్రవిడ్ రికార్డుపై కోహ్లీ కన్ను](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13970106-674-13970106-1640085842110.jpg?imwidth=3840)
Kohli Dravid Record: దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ విజేతగా నిలవాలని ఉవ్విళ్లూరుతోంది టీమ్ఇండియా. సఫారీ జట్టు బలహీనంగా ఉండటం, కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో కోహ్లీసేన మంచి జోరుమీదుందటం చూస్తే.. ఈ సిరీస్‌లో మన జట్టే ఫేవరెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా.. ఈ సిరీస్ ద్వారా ప్రస్తుతం కోచ్ ద్రవిడ్ రికార్డును కోహ్లీ దాటేసే అవకాశం ఉంది. ఆ రికార్డేంటంటే!
సౌతాఫ్రికా పిచ్‌లపై టెస్టుల్లో ద్రవిడ్ 22 ఇన్నింగ్స్‌ల్లో 624 పరుగులు చేశాడు. సగటు 29.71గా ఉంది. ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న విరాట్.. ఇక్కడి పిచ్‌లపై 10 ఇన్నింగ్స్‌ల్లో 55.80 సగటుతో 558 పరుగులు సాధించాడు. ఇక ప్రస్తుత పర్యటనలో కనుక మరో 66 పరుగులు సాధిస్తే.. సఫారీ గడ్డపై టెస్టుల్లో ఎక్కువ పరుగులు సాధించిన భారత బ్యాటర్ల జాబితాలో కోహ్లీ.. ద్రవిడ్‌ను దాటి రెండో స్థానానికి చేరతాడు. కానీ.. అగ్రస్థానానికి చేరడం మాత్రం కష్టమే. ఎందుకంటే బ్యాటింగ్ దిగ్గజం సచిన్.. సౌతాఫ్రికా పిచ్‌లపై 15 టెస్టులాడి 46.44 సగటుతో 1161 పరుగులు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇందులో ఐదు సెంచరీలు, మూడు అర్ధశతకాలు ఉండటం విశేషం.
India vs SA Series: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య డిసెంబర్ 26 (బాక్సింగ్ డే) నుంచి తొలి టెస్టు ప్రారంభమవుతుంది. రెండో టెస్టు జనవరి 03-07, ఆఖరి టెస్టు జనవరి 11-15 వరకు జరుగుతుంది. జనవరి 19, 21, 23వ తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి.