Virat Kohli Captaincy Ravi Sastri: భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి.. టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంపై స్పందించాడు. విరాట్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని పేర్కొన్నాడు. మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్లో బాగా ఆడడానికి ఆ నిర్ణయం దోహదం చేస్తుందన్నాడు.
"అతడు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడం కాస్త బాధ పెట్టే విషయమే.. కానీ విరాట్ అప్పటి నుంచి ఒత్తిడి లేకుండా ఉంటున్నాడు. దీని వల్ల తన కెరీర్లో మరికొన్ని సంవత్సరాల పాటు ఆటను దిగ్విజయంగా ఆడతాడు. కెప్టెన్సీని వదులుకున్న విరాట్ నిర్ణయాన్ని నేను సమర్థిస్తున్నాను. అయితే అతడు భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా తిరిగి బాధ్యతలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉండటం అంత సులభం కాదు. భారత జట్టు సారథి ఎదురుకున్నంత ఒత్తిడిని మరే జట్టు కెప్టెన్ ఎదురుకోలేడు"
- రవిశాస్త్రి, భారత మాజీ హెడ్ కోచ్
Virat Kohli Captaincy: గతేడాది నవంబరులో టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత పొట్టి ఫార్మాట్‌లో టీమ్ఇండియా కెప్టెన్సీకి కోహ్లీ వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ అతడిని తప్పించింది. సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత సుదీర్ఘ ఫార్మాట్‌లో కెప్టెన్సీని కూడా కోహ్లీ గుడ్‌బై చెప్పాడు. దీంతో మూడు ఫార్మాట్లలో టీమ్ఇండియా పగ్గాలు రోహిత్ శర్మకు దక్కాయి.
కోహ్లీ నా ఆరాధ్య దైవం: ఐపీఎల్ 15వ సీజన్లో ఈ ఏడాది కొత్తగా చేరిన లఖ్‌నవూ జట్టు ఆల్‌రౌండర్ కరణ్ శర్మ.. కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. విరాట్ తన ఆరాధ్య దైవమని, చాలా గొప్పవాడని అన్నాడు. తనకు కోహ్లీకి చాలా విషయాల్లో పోలికలు ఉన్నాయని తెలిపాడు. తామిద్దరి బ్యాటింగ్ శైలి చాలా వరకు ఒకేలా ఉంటుందని చెప్పాడు.
ఇదీ చదవండి: సీఎస్కే కెప్టెన్‌గా తప్పుకున్న ధోనీ..కొత్త సారథి అతడే