Virat Kohli Break From White Ball Cricket : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. సంచలన నిర్ణయం తీసుకున్నాడు. డిసెంబర్లో సౌతాఫ్రిక పర్యటనలో వైట్‌బాల్ క్రికెట్ (టీ20, వన్డే) కు దూరంగా ఉండాలని అనుకుంటున్నాడట. ఈ మేరకు తన నిర్ణయాన్ని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. సఫారీలతో డిసెంబర్ 26న ప్రారంభమయ్యే టెస్టు మ్యాచ్‌లో యథావిధిగా ఆడనున్నట్లు విరాట్ స్పష్టం చేశాడట.
India Tour Of South Africa 2023 : భారత్ డిసెంబర్లో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భారత్.. సౌతాఫ్రికాతో 3 టీ20లు, 3వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. టీ20 మ్యాచ్‌లు రాత్రి 9.30 గంటలకు, వన్డేలు మధ్యాహ్నం 4.30 (తొలి వన్డే మధ్యాహ్నం 1.30) ప్రారంభం అవుతాయి. ఇక మొదటి టెస్టు మధ్యాహ్నం 1.30, రెండో టెస్టు మ్యాచ్ మధ్యాహ్నం 2.00 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి.
-
He deserves this break . We would need his best in the test series against South Africa . https://t.co/KGFOhvVhQA
— Swarit Søhaard (@SSohaard) November 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">He deserves this break . We would need his best in the test series against South Africa . https://t.co/KGFOhvVhQA
— Swarit Søhaard (@SSohaard) November 29, 2023He deserves this break . We would need his best in the test series against South Africa . https://t.co/KGFOhvVhQA
— Swarit Søhaard (@SSohaard) November 29, 2023
భారత్ పర్యటన 2023
మ్యాచ్ | తేదీ | వేదిక |
తొలి టీ20 | డిసెంబర్ 10 | డర్బన్ |
రెండో టీ20 | డిసెంబర్ 12 | సెయింట్ జార్జ్ పార్క్ |
మూడో టీ20 | డిసెంబర్ 14 | జొహెన్నస్‌బర్గ్ |
తొలి వన్డే | డిసెంబర్ 17 | జొహెన్నస్‌బర్గ్ |
రెండో వన్డే | డిసెంబర్ 19 | సెయింట్ జార్జ్ పార్క్ |
మూడో వన్డే | డిసెంబర్ 21 | బోలాండ్ పార్క్, పారి |
తొలి టెస్టు | డిసెంబర్ 26-30 | సెంచూరియన్ |
రెండో టెస్టు | జనవరి 03-07 | కేప్‌టౌన్ |
Team India Squad For South Africa Tour : ఈ పర్యటనకు సంబంధించి అజిత్ అగర్కార్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. త్వరలోనే జట్టును ప్రకటించనుంది. అయితే ఈ పర్యటనలో కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టీ20, వన్డే మ్యాచ్‌లు ఆడతాడా లేదా అన్న విషయంపై ఎలాంటి స్పష్టత లేదు.
Virat Kohli World Cup 2023 Stats : 2023 ప్రపంచకప్‌లో విరాట్ విజృంభించాడు. అతడు 11 మ్యాచ్‌ల్లో 95.62 సగటుతో 765 పరుగులు చేశాడు. అందులో 3 సెంచరీలు 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇదే టోర్నమెంట్లో విరాట్.. వన్డేల్లో 50వ శతకం అందుకొని వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇక ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ నిలిచి.. 'మ్యాన్ ఆఫ్ ది టోర్నీ అవార్డు పొందాడు' విరాట్.