ETV Bharat / sports

IPL: ఆర్సీబీ పేలవ రికార్డు.. టాప్​-10లోని నాలుగు స్థానాల్లో ఈ జట్టే! - ఐపీఎల్ 2022 లైవ్​ అప్డేట్స్​

ఐపీఎల్​లో భాగంగా శనివారం (ఏప్రిల్ 23) సన్​రైజర్స్​తో జరిగిన మ్యాచ్​లో ఘోరంగా ఓడిపోయింది ఆర్సీబీ. ఈ మ్యాచ్​లో బెంగళూరు సాధించిన స్కోరు (68). మెగాటోర్నీ​ చరిత్రలోనే ఆర్సీబీకి ఇది రెండో అత్యల్ప స్కోరు. ఈ నేపథ్యంలో టోర్నీలో ఇప్పటివరకు నమోదైన టాప్‌-10 అత్యల్ప స్కోర్ల జాబితా ఏంటో ఒకసారి పరిశీలిద్దాం.

top 10 lowest scores in ipl
top 10 lowest scores in ipl
author img

By

Published : Apr 24, 2022, 11:44 AM IST

బెంగళూరు జట్టు పరిస్థితి ఒక్కోసారి ఎవరికీ అంతుబట్టదు. ఆ జట్టును నడిపించే యాజమాన్యానికి కూడా ఎందుకిలా జరుగుతుందనే కనీస ఆలోచన వస్తున్నట్లు కూడా కనిపించడంలేదు. పేరుకు గొప్ప జట్టు.. జట్టులో భీకర ఆటగాళ్లు ఉన్నా.. ఒక్క ట్రోఫీ సాధించలేదు. ఈ క్రమంలోనే టోర్నీ చరిత్రలో టాప్‌-10 అత్యల్ప స్కోర్ల జాబితాలో 4 స్కోర్లు ఆ జట్టే పేలవ ప్రదర్శన రికార్డులు నమోదుచేసింది. ఏటా భారీ అంచనాల నడుమ బరిలోకి దిగడం.. పలు పరాభవాలు ఎదుర్కోవడం.. మళ్లీ గాడిలో పడటం.. ఇక బాగా ఆడుతోందని అనుకునేలోపే అత్యంత పేలవ ప్రదర్శన చేయడం దానికి పరిపాటిగా మారింది. దీంతో ఘోర అవమానాల్ని మూటగట్టుకుంటూ అభిమానులను సైతం తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. తాజాగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ బెంగళూరు 68 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఈ టోర్నీలో ఇప్పటివరకు నమోదైన టాప్‌-10 అత్యల్ప స్కోర్ల జాబితా ఏంటో ఒకసారి పరిశీలిద్దాం.

బెంగళూరు 49: ఈ టీ20 లీగ్‌లో 49 పరుగులకే ఆలౌటై టోర్నీ చరిత్రలోనే అత్యల్ప స్కోర్‌ నమోదుచేసిన జట్టుగా బెంగళూరు పేలవ రికార్డు నెలకొల్పింది. 2017లో కోల్‌కతాతో తలపడిన మ్యాచ్‌లో 131 పరుగుల స్వల్ప ఛేదనలో బెంగళూరు పూర్తిగా తడబడింది.

రాజస్థాన్‌ 58: అత్యల్ప స్కోర్ల జాబితాలో రాజస్థాన్‌ రెండో స్థానంలో నిలిచింది. 2009లో బెంగళూరుతో ఆడిన మ్యాచ్‌లో 134 పరుగుల స్వల్ప ఛేదనలో 58 పరుగులకు ఆలౌటైంది.

దిల్లీ 66: దిల్లీ 2017లో ఒకే వారంలో రెండుసార్లు అత్యల్ప స్కోర్లు నమోదు చేసింది. దీంతో ఈ జాబితాలో మూడు, నాలుగు స్థానాల్లో తనే నిలిచింది. తొలుత కోల్‌కతాతో తలపడిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 67 పరుగులకే ఆలౌటైన ఆ జట్టు తర్వాత ముంబయితో జరిగిన మ్యాచ్‌లో 213 పరుగుల భారీ ఛేదనలో 66 పరుగులకే చాపచుట్టేసింది.

కోల్‌కతా 67: ఈ జాబితాలో కోల్‌కతా ఐదో స్థానంలో కొనసాగుతోంది. 2008లో ముంబయితో ఆడిన గేమ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 67 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ముంబయి స్వల్ప లక్ష్యాన్ని సునాయాంగా ఛేదించింది.

బెంగళూరు 68: గతరాత్రి హైదరాబాద్‌తో ఆడిన మ్యాచ్‌లో బెంగళూరు 68 పరుగులకే కుప్పకూలి ఈ జాబితాలో ఆరో స్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే 2019లో చెన్నైతో ఆడిన మ్యాచ్‌లో 70 పరుగులు, 2014లో రాజస్థాన్‌తో ఆడిన మ్యాచ్‌లో 70 పరుగులకే ఆలౌటై ఏడు, ఎనిమిది స్థానాలను కూడా ఆ జట్టే సొంతం చేసుకుంది. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ తొలుత బ్యాటింగ్‌ చేయడం గమనార్హం.

పంజాబ్‌ 73: ఈ జాబితాలో పంజాబ్‌ది తొమ్మిదో స్థానం. 2017లో పుణె జట్టుతో ఆడిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 73 పరుగులకే ఆలౌటైంది. అనంతరం పుణె ఒక్క వికెట్‌ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

కొచి 74: కొచి టస్కర్స్‌ 2011లో అత్యల్ప స్కోర్‌ నమోదు చేసి ఈ జాబితాలో పదో స్థానంలో నిలిచింది. ఆ మ్యాచ్‌లో హైదరాబాద్‌ నిర్దేశించిన 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక కొచి 74 పరుగులకే కుప్పకూలింది.

ఇదీ చూడండి: IPL 2022: ఆర్సీబీకి ఈ తేదీ అంత ప్రత్యేకమా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.