టీమ్ఇండియా ప్రధాన కోచ్గా రవిశాస్త్రి(ravi shastri news) పదవి టీ20 ప్రపంచకప్ తర్వాత ముగిసిపోనుంది. దీంతో కొత్త కోచ్(team india new coach) ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరోసారి రవిశాస్త్రికి ఈ పదవి అప్పజెప్పే యోచనలో బీసీసీఐ లేదని తెలుస్తోంది. దీంతో కొత్త కోచ్(team india new coach) కోసం త్వరలోనే దరఖాస్తులు ఆహ్వానించనున్నారు. ఈ పదవి రేసులో భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ పేరు ఎక్కువగా వినపడుతుండగా.. కుంబ్లే కూడా లైన్లో ఉన్నాడని సమాచారం. తాజాగా ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ టామ్ మూడీ(tom moody news) కూడా ఈ కోచ్(team india new coach) పదవి కోసం దరఖాస్తు చేసే యోచనలో ఉన్నాడట.
ప్రస్తుతం ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్రైజర్స్ హైదరాబాద్, శ్రీలంక జట్టుకు క్రికెట్ బోర్డు డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు మూడీ(tom moody news). ఇప్పటికే మూడుసార్లు భారత జట్టు కోచ్ పదవికి ఇతడు దరఖాస్తు చేసుకున్నా అవకాశం మాత్రం రాలేదు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా హెడ్ కోచ్(team india new coach) రేసులో టామ్ మూడీ నిలవబోతున్నాడని తెలుస్తోంది.
సన్రైజర్స్ హైదరాబాద్కు 2013 నుంచి 2019 వరకు కోచ్గా పనిచేశాడు మూడీ(tom moody news). ఇతడి పర్యవేక్షణలోనే 2016లో ఈ జట్టు టైటిల్ గెలుచుకుంది. 2020లో ఇతడి స్థానంలో ట్రెవర్ బెయిలిస్ను కోచ్గా నియమించింది సన్రైజర్స్. తర్వాత మూడీని ఫ్రాంచైజీకి డైరెక్టర్గా బాధ్యతలు అప్పగించింది.