ETV Bharat / sports

IND VS WI 2023 : అరంగేట్ర మ్యాచ్​లో అదరగొట్టిన కుర్రాళ్లు - west indies tour tilak varma

Tilak Varma International Career : వెస్టిండీస్​తో సిరీస్​ సందర్భంగా టీమ్​ఇండియాకు ప్రతిభ కలిగిన ఇద్దరు యువ క్రికెటర్లు దొరికారు. అరంగేట్ర టెస్ట్ మ్యాచ్​లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ సెంచరీతో కదం తొక్కగా.. టీ 20 సిరీస్​లో తిలక్ వర్మ అదరగొట్టాడు. అంతేగాక టీమిండియా యువ సంచలనం తిలక్‌ వర్మ విండీస్​తో టీ20 సిరీస్​లో మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అదేంటో తెలుసా?

tilak varma international career
tilak varma international career
author img

By

Published : Aug 14, 2023, 4:11 PM IST

Updated : Aug 14, 2023, 4:21 PM IST

Tilak Varma International Career : వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్​లో ఓటమిపాలైంది టీమ్​ఇండియా. పసికూనలతో పోటీ పడి ఐసీసీ మెగా ఈవెంట్లకు అర్హత సాధించలేక చతికిలపడ్డ విండీస్‌ చేతిలో టీమ్​ఇండియా ఓడిపోయింది. అయితే.. ఈ పర్యటన ద్వారా యశస్వి జైశ్వాల్‌, తిలక్‌ వర్మ రూపంలో ఇద్దరు యువ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో క్రీడావర్గాల్లో చర్చనీయాంశమయ్యారు. వారి గురించి తెలుసుకుందాం ఓ సారి.

అరంగేట్రంలో అదరగొట్టిన యువ ఆటగాళ్లు..
Yashasvi Jaiswal And Tilak Varma : కేవలం ఐపీఎల్‌కు మాత్రమే తమ ఆట పరిమితం కాదని.. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ సత్తా చాటగలమని నిరూపించుకున్నారు ఈ యువ ఆటగాళ్లు. అరంగేట్ర మ్యాచ్‌లోనే విలువైన ఇన్నింగ్స్‌ ఆడి సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. టెస్టులో సెంచరీతో యశస్వి మెరవగా.. తిలక్‌ తొలి టీ20లోనే టాప్‌ స్కోరర్‌గా నిలిచి ఔరా అనిపించుకున్నాడు.

బౌలింగ్​లో సత్తా..
Tilak Varma Bowling Stats : ఇక వెస్టిండీస్‌తో నాలుగో టీ20కి ముందు భవిష్యత్తులో తిలక్ వర్మ, యశస్వి జైశ్వాల్​తో వీరిద్దరితో బౌలింగ్‌ కూడా చేయిస్తామంటూ టీమ్​ఇండియా బౌలింగ్‌ కోచ్‌ పారస్‌ మాంబ్రే తెలిపాడు. నైపుణ్యాలకు పదును పెడితే కచ్చితంగా బౌలర్లుగా కూడా రాణించలగరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశాడు. అందుకు తగ్గట్లుగానే తిలక్‌ వర్మ ఐదో టీ20లో 2 ఓవర్లు బౌలింగ్‌ చేసి.. 17 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ పడగొట్టాడు. నికోలస్‌ పూరన్‌ వంటి బిగ్‌ హిట్టర్​ను ఔట్ చేశాడు. బ్రాండన్‌ కింగ్‌తో మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పి కొరకరాని కొయ్యగా మారిన పూరన్​ను బోల్తా కొట్టించాడు తిలక్​.

వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌ 13.2 ఓవర్లో తిలక్‌ సంధించిన బంతిని తప్పుగా అంచనా వేసిన పూరన్‌.. స్విచ్‌ హిట్‌కు యత్నించి స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యకు క్యాచ్‌ ఇచ్చాడు. ఈ క్రమంలో తిలక్ వర్మకు అంతర్జాతీయ క్రికెట్​లో తొలి వికెట్ దక్కింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

మరో రికార్డు దాసోహం..
తిలక్‌ వర్మ.. అంతర్జాతీయ టీ20ల్లో మొదటి ఐదు మ్యాచ్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన రెండో ఇండియా ప్లేయర్​గా రికార్డులకెక్కాడు. ఫ్లోరిడా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన ఐదో టీ20లో 27 పరుగులు చేసిన తిలక్‌.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. తిలక్‌ వర్మ తన ఐదు టీ20 మ్యాచ్‌ల్లో కలిపి 173 పరుగులు సాధించాడు.

అంతకుముందు టీమ్ఇండియా ఆటగాడు దీపక్‌ హుడా(172)ను వర్మ అధిగమించాడు. ఇక అరుదైన ఘనత సాధించిన జాబితాలో భారత స్టార్‌ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌(179) అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక విండీస్‌ టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన 20 ఏళ్ల తిలక్‌ వర్మ.. ఈ సిరీస్‌ అసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.

IND vs WI 5th T20 Results : కాగా.. అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్​లో టీమ్​ఇండియా 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో ఆతిథ్య కరేబియన్‌ జట్టు 3-2తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక విండీస్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తిలక్‌ తొలి మూడు టీ20లలో వరుసగా 39,51,49 పరుగులు చేశాడు. నాలుగో టీ20లో బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. ఇక ఆఖరిదైన ఐదో టీ20లో 27 పరుగులు సాధించాడు.

Yashasvi Jaiswal Man Of The Match : జైశ్వాల్​పై మాజీల ప్రశంసలు.. సూపర్ స్టార్ అంటూ కితాబు..

Tilak Varma Suresh Raina : అచ్చం ఓకేలాగా.. వీరిద్దరి మధ్య ఈ 9 కామన్​ విషయాలు తెలిస్తే సర్​ప్రైజ్​ పక్కా!

Last Updated : Aug 14, 2023, 4:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.