ETV Bharat / sports

2011 ప్రపంచకప్​ ఫైనల్ ప్లేయర్​​.. ప్రస్తుతం బస్సు డ్రైవర్​

author img

By

Published : Aug 25, 2021, 2:23 PM IST

ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్​లో ఆడిన క్రికెటర్​.. ఇప్పడు ఇల్లు గడవక బస్సు డ్రైవర్​గా పని చేస్తున్నాడంటే నమ్మగలరా? కానీ, ఇది నిజం. మరి అతడు ఎవరు? బస్సు డ్రైవర్​గా మారడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి?

suraj randiv
సూరజ్ రణ్​దీవ్

'తానొకటి తలిస్తే.. దైవమొకటి తలుస్తుంది' అనేది తెలుగు నానుడి. కొంతమంది జీవితాలకు అది ఇట్టే సరిపోతుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ శ్రీలంక మాజీ క్రికెటర్​ సూరజ్​ రణ్​దీవ్ (Suraj Randiv)​. ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్​లో ఫర్వాలేదనిపించిన సూరజ్​.. ప్రస్తుతం ఇల్లు గడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు.

2011 ప్రపంచకప్​లో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించాడు సూరజ్​. కానీ, ప్రస్తుతం తన ఇల్లు గడవడానికి ఆస్ట్రేలియాలో బస్సు డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. టీమ్ఇండియాతో జరిగిన ఫైనల్​ పోరులోనూ ఈ ఆఫ్​బ్రేక్​ బౌలర్​​ ఆడాడు. లంక తరఫున 12 టెస్టుల్లో 43, 31 వన్డేల్లో 36, 7 టీ20ల్లో 7 వికెట్ల చొప్పున తీసుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్​లోనే కాకుండా వన్డేల్లోనూ ఒకసారి 5 వికెట్ల ప్రదర్శన చేశాడు.

రణ్​దీవ్​.. ఐపీఎల్​లో చెన్నై జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. రెండు సీజన్లలో 8 మ్యాచ్​లు ఆడిన అతడు 6 వికెట్లు తీశాడు. జిల్లా స్థాయిలో దండేనాంగ్​ క్రికెట్​ క్లబ్​కు ఆడాడు. 2020-21 బోర్డర్​- గావస్కర్​ సిరీస్​కు ముందు ఆసీస్​ బౌలర్లకు నెట్​ బౌలర్​గానూ పనిచేశాడు.

ఇక ఆస్ట్రేలియాలో రణ్​దీవ్​తో పాటు మరో లంక ఆటగాడు చింతక నమస్తే, మాజీ జింబాబ్వే ప్లేయర్​ వడ్డింగ్టన్​ వెయెంగా.. సైతం బస్​ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు.

ఇదీ చదవండి: Virat Kohli: 'అది ప్రత్యర్థి బలాన్ని బట్టి ఉంటుందా?.. ఇదేం ప్రశ్న'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.