ETV Bharat / sports

Champions Trophy: ధోనీ కెప్టెన్సీలో కప్​ గెలిచి.. జగజ్జేతగా నిలిచి

టీమ్​ఇండియా ప్రపంచ ఛాంపియన్​షిప్​ ట్రోఫీని దక్కించుకుని బుధవారానికి ఎనిమిదేళ్లు పూర్తయింది. ఇంగ్లాండ్​తో జరిగిన తుదిపోరులో గెలిచి.. రెండోసారి ట్రోఫీని భారత జట్టు ముద్దాడింది. టీ20, వన్డే ప్రపంచకప్​ల తర్వాత ధోనీ సారథ్యంలో భారత్​కు దక్కిన మూడో ఐసీసీ ట్రోఫీ ఇది.

India clinched ICC Champions Trophy in 2013
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ
author img

By

Published : Jun 23, 2021, 10:37 AM IST

మహేంద్రసింగ్​ ధోనీ నాయకత్వంలో టీమ్​ఇండియా, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుని అప్పుడే ఎనిమిదేళ్లు పూర్తయింది. అప్పటికే టీ20, వన్డే ప్రపంచకప్​లు గెలిచి భారత జట్టు అద్భుతమైన ఫామ్​లో ఉన్న భారత జట్టుకు అప్పట్లో అది ఫుల్ జోష్ ఇచ్చిన ట్రోఫీ.

ఇంగ్లాండ్​లోని ఎడ్జ్​బాస్టన్ వేదికగా జరిగిన ప్రపంచ ఛాంపియన్స్ ట్రోఫీ​ తుదిపోరులో భారత్​, ఇంగ్లాండ్​ పోటీ పడ్డాయి. వర్షం కారణంగా మ్యాచ్​ను 20 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్​ చేసిన టీమ్​ఇండియా 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. విరాట్​ కోహ్లీ (43), రవీంద్ర జడేజా (33) రాణించడం వల్ల భారత్​ మెరుగైన స్కోరు చేసింది.

dhoni Champions Trophy
కప్ అందుకుంటున్న ధోనీ

130 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లీష్​ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 124 పరుగులు చేసి ఓడిపోయింది. ఓపెనర్లు విఫలమైనా.. మోర్గాన్​ (33), బొపారా (30) మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. ఫలితంగా 5 పరుగుల తేడాతో ఇంగ్లాండ్​పై టీమ్ఇండియా విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. 'మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​'గా రవీంద్ర జడేజా, 'మ్యాన్​ ఆఫ్​ ది సిరీస్​'గా శిఖర్​ ధావన్​లు నిలిచారు.

రెండోసారి విజేతగా..

ఆస్ట్రేలియా తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన రెండో జట్టుగా టీమ్​ఇండియా ఘనత సాధించింది. 2002లో శ్రీలంకలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ ఫైనల్​లో వర్షం కారణంగా లంక, భారత్​లను ఆ ఏడాది సంయుక్త విజేతలుగా ప్రకటించారు.

ICC Champions Trophy Final
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్​ మ్యాచ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.