ETV Bharat / sports

IND Vs NZ: శ్రేయస్​ ధనాధన్​ ఇన్నింగ్స్​.. టీమ్​ఇండియా 258/4 - టీమ్ఇండియా న్యూజిలాండ్​ మ్యాచ్​ లైవ్​ స్కోరు

తొలి టెస్టులో భాగంగా మొదటి రోజు ఆట ముగిసేసరికి టీమ్​ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో శ్రేయస్​ అయ్యర్​ (75), రవీంద్ర జడేజా(50) ఉన్నారు.

IND Vs NZ first test match, టీమ్​ఇండియా న్యూజిలాండ్​ టెస్ట్​ మ్యాచ్​
టీమ్​ఇండియా న్యూజిలాండ్​ టెస్ట్​ మ్యాచ్​
author img

By

Published : Nov 25, 2021, 4:44 PM IST

Updated : Nov 25, 2021, 9:50 PM IST

కాన్పూర్​ వేదికగా టీమ్​ఇండియా-న్యూజిలాండ్​ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. టీమ్​ఇండియా బ్యాటర్లు అదరగొట్టారు. ఆట పూర్తయ్యే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో శ్రేయస్​ అయ్యర్​ (75), రవీంద్ర జడేజా(50) ఉన్నారు.

మొదట టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న టీమ్​ఇండియాకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(13) జేమీసన్​ వేసిన 7వ ఓవర్లో తొలి వికెట్​గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి శుభమన్​ గిల్​(52) ధనాధన్​ ఇన్నింగ్స్​ ఆడగా.. సీనియర్ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారా (26) నిరాశపరిచాడు. అనంతరం కెప్టెన్ అజింక్య రహానే 35 పరుగుల వద్ద జేమీసన్ బౌలింగ్​లో ఓటయ్యాడు. ఈ క్రమంలోనే టీ విరామం సమయానికి భారత్​ 154/4 స్కోరు చేసింది.

ఇక టెస్ట్​ అరంగేట్రం చేసిన శ్రేయస్​ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తొలి మ్యాచ్​లోనే 75 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఇతడితో పాటు రవీంద్ర జడేజా(50) క్రీజులో కొనసాగుతున్నారు. కాగా, న్యూజిలాండ్​ బౌలర్లలో కైల్​ జెమీసన్​ 3, టిమ్​ సౌథీ ఓ వికెట్​ను దక్కించుకున్నారు.

ఇదీ చూడండి: టెస్ట్​ ఛాంపియన్​షిప్​ పట్టికలో భారత్​ స్థానం ఇదే

Last Updated : Nov 25, 2021, 9:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.