ETV Bharat / sports

T20 World Cup: ఇక పొట్టి కప్పు పోరు 'సూపర్​'గా.. 20 రోజుల పాటు సందడే సందడి - టీ20 ప్రపంచకప్ ఇండియా మ్యాచులు

క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. టీ20 ప్రపంచకప్‌ అసలైన పోరాటాలకు రంగం సిద్ధమైంది. సూపర్‌-12 దశ శనివారమే ఆరంభం కాబోతోంది. అసలే టీ20 క్రికెట్‌.. అందులోనూ ప్రపంచకప్‌ కోసం అగ్ర జట్లు తలపడుతుంటే ఆ మజానే వేరు. కప్పు కోసం కొదమసింహాల్లా తలపడడానికి ఆతిథ్య ఆస్ట్రేలియా, టైటిల్‌ ఫేవరెట్లయిన టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్‌లతో పాటు మిగతా జట్లూ సిద్ధమయ్యాయి. ఇంకో 20 రోజుల పాటు సందడే సందడి.

Etv BharatT20 World Cup 2022 Super 12
T20 World Cup 2022 Super 12
author img

By

Published : Oct 22, 2022, 6:25 AM IST

T20 World Cup 2022 Super 12: ఇక క్రికెట్‌ అభిమానులకు అంతులేని వినోదం గ్యారెంటీ. టీ20 ప్రపంచకప్‌ మొదలై వారం రోజులైనా.. అసలు సమరానికి మాత్రం ఇప్పుడే వేళైంది. ఆట తీవ్రతను ఎన్నో రెట్లు పెంచే సూపర్‌-12 నేటి నుంచే. రసవత్తర సమరాలకు సిద్ధంగా ఉండండి.
ఏ ఒక్కరో తిరుగులేని ఫేవరెట్‌కాదు. ఏ ఒక్కరినీ తేలిగ్గా తీసిపారేయలేం. బాదేవాళ్లతో నిండిన ఇంగ్లాండ్‌, సొంతగడ్డపై ఆడుతున్న ఆస్ట్రేలియా, ఐసీసీ టోర్నీలంటేనే అదరగొట్టే న్యూజిలాండ్‌, టైటిల్‌ కోసం తహతహలాడుతున్న భారత్‌, ఎప్పటిలాగే అంచనాలకు అందని పాకిస్థాన్‌.. ఇలా కప్పు సమరాన్ని ఆసక్తికరంగా మారుస్తోన్న మేటి జట్లెన్నో! కానీ చిన్న వెలితి. పొట్టి కప్పులో అత్యంత విజయవంతమైన జట్టు, రెండుసార్లు ఛాంపియన్‌ వెస్టిండీస్‌ దిగ్భ్రాంతికర రీతిలో ప్రధాన రౌండ్‌కు దూరమైంది. కూనల చేతిలో దెబ్బతిని తొలి రౌండ్లోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ర్యాంకింగ్స్‌ ఆధారంగా ఎనిమిది జట్లు నేరుగా సూపర్‌-12లో అడుగుపెట్టగా.. తొలి రౌండ్‌ ద్వారా మాజీ విజేత శ్రీలంకతోపాటు కూనలు నెదర్లాండ్స్‌, జింబాబ్వే, ఐర్లాండ్‌ అర్హత సాధించాయి. తమను తక్కువ అంచనా వేస్తే ముప్పు తప్పదని ఇప్పటికే చాటి చెప్పిన ఈ చిన్న జట్లు అసలు యుద్ధంలో ఎలా పోటీపడతాయన్నది ఆసక్తికరం. సూపర్‌ పోరు తొలి మ్యాచ్‌లో శనివారం న్యూజిలాండ్‌తో ఆస్ట్రేలియా తలపడుతుంది. మరో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను అఫ్గానిస్థాన్‌ ఢీకొంటుంది. గ్రూప్‌-2లో ఉన్న టీమ్‌ఇండియా ఆదివారం పాకిస్థాన్‌తో పోరుతో తన టైటిల్‌ వేటను ఆరంభిస్తుంది. కంగారూల గడ్డపై కప్పును ముద్దాడేదెవరో మరి!

ఈ కుర్రాళ్లు తొలిసారి..
సూపర్‌-12లో తొలిసారి పొట్టి ప్రపంచకప్‌లో ఆడుతున్న ప్రతిభావంతులైన కుర్రాళ్లు చాలా ముందే ఉన్నారు. వారిలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌ కూడా ఒకడు. గాయపడ్డ జోష్‌ ఇంగ్లిస్‌ స్థానంలో చివరి నిమిషంలో జట్టులో స్థానం సంపాదించిన అతడు.. అందరినీ ఆకర్షిస్తున్నాడు. ఆసీస్‌ అతణ్ని ఓపెనర్‌గా పంపొచ్చు.. ఫినిషర్‌గానూ ఉపయోగించుకోవచ్చు. ఆగస్టు వరకు ఒక్క అంతర్జాతీయ వైట్‌బాల్‌ మ్యాచ్‌ ఆడని యువ ఫాస్ట్‌బౌలర్‌ నసీమ్‌ షా ఇప్పుడు పాక్‌ ముఖ్యమైన ఆటగాళ్ల జాబితాలో ఉన్నాడు. ఆసియాకప్‌లో పదునైన పేస్‌తో ఆకట్టుకుని ప్రపంచకప్‌ జట్టులో స్థానం సంపాదించాడు. ఈ కొత్త ముఖాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మరో ఆటగాడు భారత పేస్‌ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌. ఐపీఎల్‌లో కచ్చితమైన యార్కర్లు, డెత్‌ ఓవర్ల బౌలింగ్‌తో ఆకట్టుకున్న అతడు.. భారత జట్టులో స్థానం సంపాదించాడు. ఇక వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ ఫిన్‌ అలెన్‌.. తమ తొలి టీ20 ప్రపంచకప్‌ ఆశలు నెరవేరడంలో కీలక పాత్ర పోషిస్తాడని న్యూజిలాండ్‌ ఆశిస్తోంది.

.

బౌలర్ల రాజ్యం?|
ఆస్ట్రేలియాలో పరిస్థితులు జట్లకు భిన్నమైన సవాలును విసరబోతున్నాయి. ప్రత్యర్థి జట్లను కట్టడి చేయడానికి వ్యూహాలు పన్నడమే కాదు.. ఆస్ట్రేలియాలో శీతాకాల పరిస్థితులను తట్టుకోవడమూ నేర్చుకోవాలి. సాధారణంగా అక్టోబరులో ఆ దేశంలో అంతర్జాతీయ క్రికెట్‌ జరగదు. ఒక్కటి మాత్రం నిజం.. మ్యాచ్‌ల్లో బ్యాటర్ల ఆధిపత్యం సాగబోవట్లేదు. ఫలితాల్లో బౌలర్లు కీలక పాత్ర పోషిస్తారని అంచనా. మ్యాచ్‌ వేదికల్లో ఒక్కో పిచ్‌ది ఒక్కో స్వభావం. పెర్త్‌, బ్రిస్బేన్‌లు పూర్తిగా పేస్‌కు సహకరించే పిచ్‌లు కాగా.. ఎంసీజీ, ఎస్‌సీజీ, అడిలైడ్‌లు స్పిన్నర్లకు అనుకూలించనున్నాయి. మైదానాలు పెద్దవి కావడం కూడా బ్యాటర్లకు సవాలే.

భారీ షాట్లు మాత్రమే సరిపోవు.. వికెట్ల మధ్య పరుగూ ముఖ్యమే. ఆస్ట్రేలియాలో మూడు భిన్నమైన టైమ్‌ జోన్లు ఉన్నాయి. వాతావరణం భిన్నంగా ఉంటుంది. మెల్‌బోర్న్‌లో భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్‌ రోజైన ఆదివారం వర్షం పడే అవకాశాలు 80 శాతం ఉన్నాయని స్థానిక వాతావరణ శాఖ పేర్కొంది. ఒకవేళ మ్యాచ్‌ జరిగితే మాత్రం జీవం నిండిన పిచ్‌ నుంచి పేసర్లు, స్పిన్నర్లకు మంచి సహకారం లభిస్తుందన్నది అంచనా. ఈ ప్రపంచకప్‌లో బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తారని బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ కూడా అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో వాతావరణం పచ్చిగా ఉందని, సూపర్‌-12 తొలి దశలో వర్షాలు ఉండొచ్చని.. ఆ తర్వాత బంతికీ, బ్యాటుకూ మంచి పోటీ ఉంటుందని మాజీ స్పీడ్‌స్టర్‌ బ్రెట్‌లీ అన్నాడు.

.

ఆసక్తికర సమరంతో సూపర్‌-12కు తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో శనివారం ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు న్యూజిలాండ్‌ను ఢీకొంటుంది. నిరుడు జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు ఫైనలిస్టులు. కివీస్‌ను ఓడించి ఆస్ట్రేలియా టైటిల్‌ గెలిచింది. రెండు జట్లూ బలంగా ఉన్న నేపథ్యంలో ఆసక్తికర పోరు ఖాయం. కానీ సిడ్నీలో వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేదు. వర్షం వల్ల అసలు ఈ మ్యాచ్‌ జరగడమే అనుమానంగా మారింది. వాన కురిసే అవకాశం 90 శాతం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

.
  • 1.. 20 ప్రపంచకప్‌ ప్రధాన టోర్నీకి అర్హత సాధించడం జింబాబ్వేకు ఇదే తొలిసారి
  • 5.. సూపర్‌-12లో ఉన్న జట్లలో కనీసం ఒకసారి ప్రపంచకప్‌ గెలిచినవి. భారత్‌, పాకిస్థాన్‌, శ్రీలంక, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా ఒక్కోసారి విజేతగా నిలిచాయి.
  • 2.. ఐర్లాండ్‌ సూపర్‌ దశకు చేరుకోవడం ఇది రెండోసారి. 2009లో ఆ జట్టు సూపర్‌-8లో పోటీపడింది.
.
  • ఇప్పటిదాకా ఏడు టీ20 ప్రపంచకప్‌లు జరగ్గా.. అత్యధికంగా రెండుసార్లు వెస్టిండీస్‌ (2012, 2016) ట్రోఫీని దక్కించుకుంది. భారత్‌ (2007), పాకిస్థాన్‌ (2009), ఇంగ్లాండ్‌ (2010), శ్రీలంక (2014), ఆస్ట్రేలియా (2021) ఒక్కోసారి విజేతగా నిలిచాయి.
  • వెస్టిండీస్‌ ఆతిథ్యమిచ్చిన 2012 ప్రపంచకప్‌ తర్వాత ఆసియా అవతల జరుగుతున్న పొట్టి కప్పు ఇదే. ఆస్ట్రేలియా తొలిసారి ఈ టోర్నీకి ఆతిథ్యమిస్తోంది.
  • మాజీ ఛాంపియన్‌ శ్రీలంక ఈసారి నేరుగా టోర్నీకి అర్హత సాధించలేక, చిన్న జట్లతో తొలి రౌండ్లో పోటీ పడి సూపర్‌-12కు చేరుకుంది. మరో ఛాంపియన్‌ వెస్టిండీస్‌ పేలవ ప్రదర్శనతో తొలిదశలోనే ఇంటిముఖం పట్టింది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.