ETV Bharat / sports

T20 World Cup: పొట్టి కప్పు సమరం షురూ.. మ్యాచ్​ లైవ్​ స్ట్రీమింగ్​ ఎక్కడంటే? - వరల్డ్​ కప్​ మ్యాచ్​ రిజర్వ్​ రోజులు

T20 World Cup 2022 : ఐసీసీ టీ20 వరల్డ్​ కప్​ మొదలైంది. ఇక నెల రోజులపాటు క్రికెట్​​ అభిమానులకు కిక్కే కిక్కు. అయితే ఏ టీవీ ఛానల్​/స్ట్రీమింగ్​ ప్లాట్​ఫాంలో మ్యాచ్​లు వీక్షించొచ్చు? ఒకవేళ మ్యాచ్​లు ఏదైనా కారణం వల్ల ఆగిపోతే ఏమౌంది? అనే విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవేయండి.

T20 World Cup 2022
T20 World Cup 2022
author img

By

Published : Oct 16, 2022, 11:07 AM IST

T20 World Cup 2022: ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్న మెగా టోర్నీ ఐసీసీ ప్రపంచ కప్​ 2022.. ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభమైంది. ఇప్పటివరకు జరిగిన వరల్డ్​ కప్​ల్లో ఇదే అతిపెద్ద వరల్డ్​ కప్​గా అవతరించనుంది. ఎందుకంటే ఇందులో 16 జట్లు ఆస్ట్రేలియా వేదికగా 45 మ్యాచులు ఆడనున్నాయి.

ఈ మ్యాచ్​ ఏ ఛానల్​/ఆన్​లైన్ ప్లాట్​ఫాంలో ప్రసారమౌతాయి?
ఐసీసీ వరల్డ్​ కప్​ టీవీ ప్రసారం, ఆన్​లైన్ స్ట్రీమింగ్​ హక్కులను స్టార్​ నెట్​వర్క్​ దక్కించుకుంది. దీంతో పాటు స్కై స్పోర్ట్స్, ఫాక్స్ స్పోర్ట్స్, ఈఎస్​పీఎన్​, పీటీవీ, టైమ్స్​ ఇంటర్నెట్​ ప్లాట్​ఫాంలలో ప్రసారమౌతాయి. అయితే వీటితో పాటు భారత్​, నేపాల్, భుటాన్, శ్రీలంక, మల్దీవుల్లో టీవీ ప్రసార హక్కులను స్టార్ నెట్​వర్క్​ దక్కించుకుంది. ఇక ఈ మెగా టోర్నో లైవ్ స్ట్రీమింగ్​ సేవలను ​భారత్​లో డిస్నీ+ హాట్​ స్టార్ సంస్థలు అందిస్తున్నాయి.

వరల్డ్​ కప్​ మ్యాచ్​లు రిజర్వ్​ డేలు..
వర్షం కారణంగా.. ఇంకా ఏ ఇతర కారణాల వల్ల మ్యాచ్​ ఆగిపోయినప్పుడు రిజర్వ్​ డేలో ఆ మ్యాచ్​ జరుగుతుంది. అయితే గ్రూప్​ స్టేజ్​లో, సూపర్ 12 స్టేజ్​లో మ్యాచ్​ ఫలితాన్ని నిర్ణయించడానికి రెండు జట్లకు కనీసం 5 ఓవర్లైనా లేకపోతే.. ఆ జట్లకు చెరొక పాయింట్ కేటాయిస్తారు. అయితే నాకౌట్ దశ మ్యాచ్​లకు ఈ షరతులతో రిజర్వ్​ డే ఉంటుంది.

  • సెమీ ఫైనల్స్​, ఫైనల్​ మ్యాచ్​లను కచ్చితంగా షెడ్యూల్​ ప్రకారం పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. అవసరమైతే ఓవర్లను కుదిస్తారు.
  • అయితే మ్యాచ్​కు అంతరాయం ఏర్పడిన రోజు.. మ్యాచ్​ నిర్ణయించడానికి రెండు జట్లు కనీసం 5 ఓవర్లైనా ఆడాలి. అలా ఆడేందుకు వీలు లేకపోతే రిజర్వ్​డేలో ఆ మ్యాచ్​ నిర్వహిస్తారు.
  • ఒకవేళ షెడ్యూల్​ రోజున మ్యాచ్​ జరిగేటప్పుడు అంతరాయం ఏర్పడితే.. ఓవర్లు కుదించి మ్యాచ్ ఆడిస్తారు. అయినా ఆడడానికి వీలు లేకుంటే.. మ్యాచ్​ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి రిజర్వ్ డే నాడు మ్యాచ్​ మళ్లీ మొదలౌతుంది.

ఇవీ చదవండి: న్యూ ట్రెండీ​ ఔట్​ఫిట్​లో అదరగొడుతున్న బాలీవుడ్​ బ్యూటీలు

అందంతో పాటు ఆటతో ఆకట్టుకుంటున్న భామలు వీరే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.