ETV Bharat / sports

T20 World Cup: ఆస్ట్రేలియా గెలుపునకు కారణాలివే.. - న్యూజిలాండ్ X ఆస్ట్రేలియా టీ20

అంచనాలేమీ లేకుండా టీ20 ప్రపంచకప్​ టోర్నీలో అడుగుపెట్టింది. ఆరంభంలో తడబడినట్లే కనిపించింది. కానీ, ఆత్మవిశ్వాసంతో గెలుపును ఆకలింపు చేసుకుంటూ ఫైనల్​కు చేరుకుంది. న్యూజిలాండ్​పై గెలిచి టీ20 ప్రపంచకప్​ను(T20 World Cup 2021) తొలిసారిగా ముద్దాడింది ఆస్ట్రేలియా. ఈ నేపథ్యంలో ఆసీస్​ గెలుపునకు కారణాలేంటో ఓసారి చూసేద్దాం..

australia
ఆస్ట్రేలియా
author img

By

Published : Nov 15, 2021, 2:02 AM IST

టీ20 ప్రపంచకప్​ టోర్నీలో(T20 World Cup 2021) ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు తొలిసారి కప్పును ముద్దాడింది. టోర్నీ ఆరంభంలో కాస్త తడబడినట్లు కనిపించినా.. మెల్లగా పుంజుకుని సత్తా చాటింది. ఆదివారం(నవంబర్ 14) జరిగిన ఫైనల్స్​లో(NZ vs AUS T20) న్యూజిలాండ్​పై అలవోకగా గెలిచింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా విజయానికి కారణాలేంటో ఓసారి చూసేద్దాం..

  • పొట్టి ప్రపంచకప్​ టోర్నీ సూపర్​ 12లో భాగంగా గ్రూప్​-1 తరఫున ఆస్ట్రేలియా తొలుత నాలుగు మ్యాచ్​లు గెలిచింది. మెరుగైన రన్​ రేట్​తో దక్షిణాఫ్రికాను వెనక్కినెట్టి సెమీస్​ అవకాశాలు ఖాయం చేసుకుంది.
  • ఆసీస్ బౌలర్ ఆడమ్​ జంపా ఓ మ్యాచ్​లో బంగ్లాదేశ్​ ఆటగాళ్లను హడలెత్తించాడు. ఆ మ్యాచ్​లో భాగంగా 19 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు.
  • ఓపెనర్​ డేవిడ్ వార్నర్​ ఫామ్​లో లేడంటూ తొలుత తీవ్రంగా విమర్శలొచ్చాయి. అయితే.. టీ20 ప్రపంచకప్​ సెమీస్​, ఫైనల్స్​ మ్యాచ్​లో వార్నర్​ దుమ్మురేపాడు. పాకిస్థాన్​తో మ్యాచ్​లో 49 పరుగులు, న్యూజిలాండ్​పై 53 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు వెస్టిండీస్​తో జరిగిన మ్యాచ్​లోనూ 89 పరుగులతో విధ్వంసక ఇన్నింగ్స్​ ఆడాడు. 'ప్లేయర్​ ఆఫ్​ ద సిరీస్'​గా నిలిచాడు.
  • గ్రూప్​ దశలో పెద్దగా ఆడని స్టోయినిస్, వేడ్​.. సెమీస్​లో పాకిస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. పేసర్లలో స్టార్క్, హేజిల్​వుడ్ కొన్ని మ్యాచ్​ల్లో కీలక ఇన్నింగ్స్ ఆడారు.
  • ఈ టోర్నీలో ఇంగ్లాండ్​ జట్టు(ENG vs AUS T20) చేతిలోనే ఓటమి చవిచూసింది ఆస్ట్రేలియా. దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, వెస్టిండీస్​పై జట్లపై ఆధిపత్యం చెలాయించింది. సెమీస్​లో పాకిస్థాన్​ను(PAK vs AUS) చిత్తు చేసింది. ఫైనల్స్​లో న్యూజిలాండ్​పై ఘన విజయం సాధించి తొలిసారి పొట్టి ప్రపంచకప్​ను ముద్దాడింది.
  • బ్యాటింగ్​తో రాణించడం, బ్యాటింగ్​ విఫలమైనా బౌలింగ్​తో ప్రత్యర్థి జట్టును హడలెత్తించడం, టీమ్​గా అత్యుత్తమ ప్రదర్శన చేయడం ఈ టోర్నీలో ఆసీస్​కు కలిసొచ్చిన ఆంశాలు.
    warner
    వార్నర్

కాగా, ఫైనల్​ మ్యాచ్​లో న్యూజిలాండ్​పై చెలరేగిపోయాడు మిచెల్ మార్ష్. డేవిడ్​ వార్నర్(53) పరుగులు చేయగా మార్ష్ 77 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్​ విధించిన 173 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది ఆసీస్.

ఆసీస్‌ గెలుచుకున్న ఐసీసీ టోర్నీలు

  • వన్డే ప్రపంచకప్‌లు (5): 1987, 1999, 2003, 2007, 2015
  • ఛాంపియన్స్ ట్రోఫీ (2): 2006, 2009
  • టీ20 ప్రపంచకప్‌ : 2021

ఇదీ చదవండి:

T20 world cup 2021: టీ20 ప్రపంచకప్​ విజేతగా ఆస్ట్రేలియా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.