ETV Bharat / sports

ind vs nz preview: భారత్-న్యూజిలాండ్ టీ20 సిరీస్.. గెట్ రెడీ - ఇండియా వర్సెస్ న్యూజిలాండ్​

టీమ్​ఇండియా.. స్వదేశంలో న్యూజిలాండ్‌తో (ind vs nz 1st t20) పోరుకు సిద్ధమైంది. ఈ టీ20 సిరీస్‌తోనే కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్‌ శర్మ జోడీ శకం ప్రారంభమవుతుంది. ఐపీఎల్‌లో రాణించిన యువ ఆటగాళ్లతో రోహిత్‌ సేన తొలి టీ20లో న్యూజిలాండ్‌ను బుధవారం తలపడనుంది. ఆస్ట్రేలియాలో జరిగే టీ-20 ప్రపంచకప్‌నకు ఏడాది మాత్రమే గడువు ఉన్నందున జట్టు కూర్పు దిశగా అడుగులు వేయాలని భారత్ భావిస్తోంది.

ind vs nz 1st t20
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్​
author img

By

Published : Nov 17, 2021, 5:31 AM IST

Updated : Nov 17, 2021, 7:28 AM IST

యూఏఈలో జరిగిన టీ20 పరాభవం నుంచి తేరుకుని టీమ్​ఇండియా (ind vs nz 1st t20) మరో పోరుకు సిద్ధమైంది. సొంతగడ్డపై న్యూజిలాండ్​తో మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​లో మొదటి మ్యాచ్​ బుధవారం జరగనుంది. టీమ్​ఇండియా కోచ్‌ రాహుల్ ద్రవిడ్, టీ-20 జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కలయికలో కొత్త శకం ఈ సిరీస్‌తోనే ఆరంభం కానుంది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న టీ-20 ప్రపంచకప్‌కు మరో 11 నెలల సమయం మాత్రమే ఉన్నందున జట్టు కూర్పుపై భారత్ దృష్టిసారించింది.

ind vs nz 1st t20 preview
కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్‌ శర్మ జోడీ

ఆల్‌రౌండర్‌ కోసం..

జట్టులో ఆల్‌రౌండర్‌ స్థానానికి న్యాయం చేయలేకపోతున్న (ind vs nz 1st t20 2021) హార్దిక్ పాండ్య స్థానంలో మరో ఆల్‌రౌండర్‌ను తయారు చేయాలని జట్టు భావిస్తోంది. ఐపీఎల్-14వ సీజన్‌లో విశేషంగా రాణించిన వెంకటేశ్ అయ్యర్‌ను జట్టుకు అవసరమైన ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ బాధ్యతలు అప్పగించే సూచనలు కనిపిస్తున్నాయి. బ్యాటింగ్ ఆర్డర్‌లో వెంకటేశ్ లాంటి పవర్ హిట్టర్‌ల కోసం భారత్‌ చూస్తోంది.

ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న రుతురాజ్ గైక్వాడ్, హర్షల్‌ పటేల్, ఆవేశ్ ఖాన్, చాహల్ వంటి ఆటగాళ్లు న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ ఆడబోయే జట్టులో ఉన్నారు. బుమ్రాకు విశ్రాంతి ఇచ్చిన నేపథ్యంలో 140 కిలోమీటర్ల వేగంతో స్థిరంగా బంతులేసే పేస్ బౌలర్‌ కోసం భారత్‌ చూస్తోంది. ఇందుకోసం ఆవేశ్ ఖాన్, మహమ్మద్ సిరాజ్‌లను పరిశీలించే అవకాశం ఉంది. టీ-20 ప్రపంచకప్‌లో ఆశించినమేర రాణించలేకపోయిన భువనేశ్వర్‌కు సైతం మునుపటి లయ అందుకునేందుకు మరో అవకాశం ఇచ్చారు.

ind vs nz 1st t20 preview
ప్రాక్టీస్​లో రోహిత్​ సేన

మిడిల్ ఆర్డర్‌లో వెంకటేశ్ అయ్యర్‌..

సంవత్సరంలోపే మరో టీ20 ప్రపంచకప్‌ (ind vs nz 1st t20 tickets) ఉన్నందున ద్రవిడ్, రోహిత్ శర్మ జోడీ ఆస్ట్రేలియా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పుడున్న జట్టులో ఐదుగురు ఓపెనర్లు ఉన్నారు. కెప్టెన్ రోహిత్, వైస్ కెప్టెన్ కేఎల్​ రాహుల్ ఓపెనింగ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, వెంకటేశ్ అయ్యర్‌లు సైతం ఓపెనింగ్ చేసే సామర్థ్యమున్నవాళ్లే. అయితే.. వెంకటేశ్ అయ్యర్‌ను మిడిల్ ఆర్డర్‌లో (ind vs nz 1st t20 batting order) ఆడించే అవకాశం ఉంది. ప్రస్తుతం జట్టుకు అవసరమైన నాలుగో స్థానం కోసం సూర్య కుమార్ యాదవ్‌ను పరిశీలించనున్నారు. జడేజా గైర్హాజరీలో అక్షర్‌ పటేల్‌కు చోటిచ్చే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్‌లో రాణించిన అశ్విన్‌ సైతం తుది జట్టులో ఉండనున్నాడు.

ind vs nz 1st t20 preview
టీమ్​ఇండియా జట్టు

జైపూర్‌ వేదికగా బుధవారం(నవంబరు 17) రాత్రి ఏడు గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుండగా భారత జట్టు ముమ్మరంగా సాధన చేస్తోంది. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఓడిన న్యూజిలాండ్.. భారత్‌తో సిరీస్‌లో పైచేయి సాధించాలని కోరుకుంటోంది. ఆ తర్వాత జరిగే టెస్టు సిరీస్‌ దృష్ట్యా టీ20 సిరీస్‌కు కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ దూరమయ్యాడు. అతడి స్థానంలో టిమ్ సౌథీ కివీస్‌ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ట్రెంట్ బౌల్ట్, మిచెల్‌ వంటి ఆటగాళ్లతో ప్రత్యర్థి జట్టు బలంగా కనిపిస్తోంది. భారత్-న్యూజిలాండ్‌ మధ్య ఈ నెల 17, 19, 21 తేదీల్లో 3 టీ-20 మ్యాచ్‌లు జరగనున్నాయి.

ind vs nz 1st t20 preview
కివీస్​ కెప్టెన్​గా టిమ్ సౌథీ

ఇవీ చదవండి:

వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్​ వేదికలు ఖరారు

'ఆ నినాదాలు నా శ్వాస ఆగేవరకు వినిపిస్తూనే ఉంటాయి'

Last Updated : Nov 17, 2021, 7:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.