ETV Bharat / sports

T20 world cup 2021: 'ఇలా అయితే టీమ్​ఇండియాకు కష్టమే!' - టీ20 వరల్డ్​కప్ అప్​డేట్స్​

టీ20 ప్రపంచకప్​ వార్మప్​ మ్యాచ్​లో ఇంగ్లాండ్​పై టీమ్​ఇండియా (T20 worldcup 2021) విజయం సాధించింది. అయినప్పటికీ ఈ మ్యాచ్​లో టీమ్ఇండియా ఆటతీరు పట్ల మాజీ క్రికెటర్ ​ పార్థివ్ పటేల్ ఆందోళన వ్యక్తం చేశాడు.

T20 worldcup
టీ20 వరల్డ్​కప్​ టీమ్ ఇండియా
author img

By

Published : Oct 19, 2021, 12:33 PM IST

Updated : Oct 19, 2021, 2:37 PM IST

టీ20 ప్రపంచకప్ (T20 worldcup 2021) వార్మప్ మ్యాచ్​లో టీమ్ఇండియా అదరగొట్టింది. ఇంగ్లీష్ జట్టు విధించిన 189 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో ఛేదించి విజయాన్ని సొంతం చేసుకుంది. షమీ(3/40), బూమ్రా(1/26),చాహర్(1/43) రాణించినప్పటికీ హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయకపోవడం, భువనేశ్వర్ పేలవ ప్రదర్శనపై టీమ్ఇండియా మాజీ కీపర్​ పార్థివ్ పటేల్ ఆందోళన వ్యక్తం చేశాడు.

"ఐదుగురు బౌలర్లను మాత్రమే విరాట్ ఉపయోగించుకునేలా కనిపిస్తోంది. కొన్ని మ్యాచ్​ల వరకైనా హార్దిక్​తో బౌలింగ్​ చేపిస్తాడని నేననుకోవడం లేదు. భువనేశ్వర్ కుమార్​ పేలవంగా బౌలింగ్​ చేస్తున్నాడు."

-పార్థివ్ పటేల్, టీమ్ఇండియా మాజీ వికెట్​ కీపర్​

వార్మప్ మ్యాచ్​లో భువనేశ్వర్ కుమార్​ బౌలింగ్​తో ఆకట్టుకోలేకపోయాడు. నాలుగు ఓవర్లలో 54 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఐపీఎల్​లోనూ కేవలం ఆరు వికెట్లు మాత్రమే తీశాడు. అటు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను విరాట్ కోహ్లీ బౌలింగ్​కు వాడుకోవడం లేదు. ఇలా అయితే.. టీ20 ప్రపంచకప్​లో నలుగురు బౌలర్లతోనే నెట్టుకురావల్సి ఉంటుంది. ఇదే విషయమై ఆందోళన వ్యక్తం చేశాడు పార్థివ్ పటేల్.

ఇదీ చదవండి:ప్రాక్టీస్​ అదిరింది.. ఇంగ్లాండ్​పై భారత్ ఘనవిజయం

స్వదేశంలో కల్లోలం.. అయినా మైదానంలో పోరాటం

Last Updated : Oct 19, 2021, 2:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.