ETV Bharat / sports

Ind vs pak T20: దాయాదుల పోరు- అభిమానుల పూజలు, హోమాలు - భారత జట్టుకు కళాకారుల శుభాకాంక్షలు

టీ20 ప్రపంచకప్​లో భారత్​-పాక్ మ్యాచ్​కు (T20 World Cup 2021) రంగం సిద్ధమైంది. అక్టోబర్ 24న రాత్రి 7.30 గంటలకు ఇరుజట్లు తలపడనున్నాయి. దీంతో దేశమంతటా సంబరాలు (T20 World Cup 2021 news) ఊపందుకున్నాయి. భారత జట్టు విజయం సాధించాలని పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు క్రీడాభిమానులు. మరికొందరు సూక్ష్మకళలతో క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎక్కడెక్కడ ఎలా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారో చూసేద్దామా?

T20 World Cup 2021 updates
భారత్​- పాక్​ మ్యాచ్
author img

By

Published : Oct 24, 2021, 1:00 PM IST

భారత్​- పాక్​ మ్యాచ్.. అభిమానుల శుభాకాంక్షలు

భారత్​-పాక్​ మ్యాచ్ అంటే తెలుసుగా.. మామూలుగా ఉండదు! ఓడితే కన్నీళ్లతో బరువెక్కే హృదయాలు.. ఆగ్రహంతో ఇళ్లలో బద్దలయ్యే టీవీలు.. ఓటమి బాధతో కొన్నిసార్లు (T20 world cup 2021) ఊపిరే ఆగిపోయే సందర్భాలు.. ఇలా ఎన్నో భావోద్వేగాలు ముడిపడి ఉన్నాయంటే.. అది కేవలం మ్యాచ్‌ మాత్రమే కాదు.. అంతకుమించి! ఈ మ్యాచ్‌లో గెలిస్తే చాలు.. అదొక ఒక పండుగలా మారి దేశమంతా సంబరాలు చేసుకుంటుందంటే.. అతిశయోక్తి కాదు. అలాంటి అరుదైన పోరుకు రంగం సిద్ధమైంది.

టీ20 ప్రపంచకప్​లో భారత్​-పాక్ మ్యాచ్​ నేపథ్యంలో (india vs pakistan match) దేశంలో క్రీడోత్సాహం నెలకొంది. అభిమాన జట్టు విజయం సాధించాలని పూజలు, హోమాలు, ప్రార్థనలు నిర్వహిస్తున్నారు క్రీడాప్రేమికులు. ఒకరు రంగోళీలు, మరొకరు ఒంటి నిండా జాతీయ జెండా రంగు పూసుకుని.. అబ్బో.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విధాలుగా భారత జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

రంగోళీతో..

T20 World Cup 2021
రంగోళీతో..

ఇందోర్​కు చెందిన కళాకారుల బృందం రంగోళీని తయారు చేసింది. భారత్​ జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతూ.. 7,700 చదరపు అంగుళాల రంగోళీకి రూపకల్పన చేశారు. 20 మంది ఉన్న ఈ బృందం.. 3 క్వింటాళ్ల రంగులతో 45 గంటలు కష్టపడి దీనిని రూపొందించారు. రోహిత్ శర్మ, ధోనీ, విరాట్ కోహ్లీ చిత్రాలతో ఈ రంగోళీని తీర్చిదిద్దారు.

ఒంటి నిండా రంగుతో..

T20 World Cup 2021
ఒంటి నిండా రంగుతో..

భారత జట్టుకు మద్దతు తెలుపుతూ అహ్మదాబాద్​లో ఓ అభిమాని శరీరాన్ని ఇలా రంగులతో ముంచేశాడు. టీమ్​ఇండియా విజయం సాధించాలని ఆకాంక్షించాడు. జాతీయ జెండాను చేతపట్టి.. తన అభిమానాన్ని చాటుకుంటున్నాడు.

హోమం..

T20 World Cup 2021
హోమం..

ప్రపంచకప్​లో టీమ్​ఇండియా విజయంతో స్వదేశానికి తిరిగిరావాలని బెంగళూరులో హోమం నిర్వహించారు అభిమానులు. పాకిస్థాన్​తో మొదటి మ్యాచ్ ఆడి టోర్నీలోకి అడుగు పెట్టనున్న భారత జట్టుకు మద్దతును ఇలా తెలుపుతున్నారు. కోహ్లీ, రోహిత్ శర్మ ఫొటోలతో కూడిన బ్యానర్​ను తయారు చేసి గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

కుస్తీ వీరులు ఇలా..

T20 World Cup 2021
కుస్తీ వీరులు ఇలా..

భారత జట్టు విజయం సాధించాలని కాన్పుర్​లో కుస్తీ క్రీడాకారులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. తమ ఆట ప్రాంగణంలోనే క్రికెట్ ఆటగాళ్ల ఫొటోలను చేతపట్టి తమ మద్దతు తెలిపారు. భారత్ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

సూక్ష్మకళతో..

T20 World Cup 2021
సూక్ష్మకళతో..

భువనేశ్వర్​కు చెందిన ఓ కళాకారిణి తన సూక్ష్మకళతో వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపింది. బంతిపై క్రీడాకారులు, వికెట్లను చిత్రించి మద్దతు ప్రకటించింది. కోహ్లీ, రోహిత్​, ధోనీ చిత్రాలను తయారు చేసి తన అభిమానాన్ని చాటుకుంది.

ఇదీ చదవండి:INS VS PAK T20: హై ఓల్టేజీ మ్యాచ్​లో పైచేయి ఎవరిదో!

T20 world cup 2021: దాయాదితో పోరు.. హిస్టరీ రిపీట్ అవుతుందా?

ప్రపంచకప్​ టైటిల్ ఫేవరెట్ భారత్​.. ఇదే కారణం?

T20 world cup 2021: పాక్​తో మ్యాచ్​ కోసం కోహ్లీకి ధోనీ టిప్స్!

T20 world cup 2021: టీ20 ప్రపంచకప్​లో ఆ రోజు రానే వచ్చింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.