IPL 2022 Umran malik record: ఐపీఎల్లో భాగంగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఓడినా.. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ మాత్రం టీ20 చరిత్రలో నిలిచిపోయేదే. బంతులను బుల్లెట్లలా మార్చి అతను సంధిస్తుంటే.. గుజరాత్ బ్యాటర్ల దగ్గర సమాధానమే లేకపోయింది. మంచి టెక్నిక్ ఉన్న గిల్‌ను ఉమ్రాన్ బౌల్డ్ చేసిన తీరు చూసి తీరాల్సిందే. ఇక మిగతా హైదరాబాద్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొని గుజరాత్‌ను విజయం వైపు పరుగులు పెట్టించిన సాహాను 150 కిలోమీటర్లకు పైగా వేగంతో విసిరిన యార్కర్‌తో బౌల్డ్ చేసిన వైనం మ్యాచ్‌కే హైలైట్. మిల్లర్, మనోహర్‌లను సైతం కళ్లు చెదిరే బంతులతో బౌల్డ్ చేశాడతను. హార్దిక్ క్రీజులోకి అడుగు పెట్టగానే ఒక బౌన్సర్‌తో అతడి భుజాన్ని గాయపరిచిన మాలిక్.. ఇంకో రెండు బంతులకే అతణ్ని పెవిలియన్ చేర్చాడు. హైదరాబాద్ జట్టులో మిగతా నలుగురు బౌలర్లూ కలిపి 16 ఓవర్లలో 173 పరుగులిస్తే.. ఉమ్రాన్ 4 ఓవర్లలో 25 పరుగులే ఇచ్చాడు. గత మ్యాచ్ హీరోలైన జాన్సన్, నటరాజన్ వరుసగా నాలుగేసి ఓవర్లలో 63, 43 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం.
ఉమ్రాన్ రికార్డు
- ఈ మ్యాచ్‌లో ఉమ్రాన్ ఓ రికార్డు కూడా సాధించాడు. ఏకంగా నలుగురు బ్యాటర్లను క్లీన్‌బౌల్డ్ చేసిన అతడు ఐపీఎల్లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.
- ఐపీఎల్లో ఐదు వికెట్ల ఫీట్ అందుకున్న ఐదో అన్క్యాప్డ్ ప్లేయర్‌గా నిలిచాడు. ఉమ్రాన్ కన్నా ముందు అంకిత్ రాజ్‌పుత్(5/14 వర్సెస్ ఎస్ఆర్హెచ్, 2018), వరుణ్ చక్రవర్తి(5/20 వర్సెస్ దిల్లీ క్యాపిటల్స్, 2020), హర్షల్ పటేల్(5/27 ముంబయి ఇండియన్స్, 2021), అర్ష్‌దీప్ సింగ్(5/32 వర్సెస్ రాజస్థాన్ రాయల్స్, 2021) ఉన్నారు.
- ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ తరఫున ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. అంతకముందు భువనేశ్వర్ కుమార్.. 2017లో పంజాబ్ కింగ్స్‌పై 5/18 చేశాడు.
- ఈ మెగాలీగ్ చరిత్రలో ఓ బౌలర్ నలుగురు బ్యాటర్లను క్లీన్‌బౌల్డ్ చేయడం ఇది మూడోసారి. అంతకముందు 2011లో దిల్లీ క్యాపిటల్స్‌పై లసిత్ మలింగ, 2012లో ఆర్సీబీపై సిద్దార్థ్ త్రివేది నలుగురు బ్యాటర్లను క్లీన్‌బౌల్డ్ చేశారు.
- ఎస్ఆర్హెచ్ తరఫున బౌలింగ్‌లో బెస్ట్ ఫిగర్స్ అందుకున్న జాబితాలోనూ ఉమ్రాన్ చోటు దక్కించుకున్నాడు. భువనేశ్వర్ కుమార్, మహ్మద్ నబీ, ఉమ్రాన్ మాలిక్ ఉన్నారు.
మార్కో పేలవ రికార్డు.. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ బౌలర్ మార్కో జాన్సెన్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు సాధించాడు. నాలుగు ఓవర్లు వేసిన అతడు 63 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేదు. లక్ష్య చేధనలో ప్రత్యర్థి జట్టుకు ఓ బౌలర్ తన కోటా ఓవర్లలో అత్యధిక పరుగులు ఇచ్చుకోవడం ఇది రెండో సారి.
అంతకముందు 2019లో దిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన లుంగి ఎంగిడి.. ముంబయితో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 62 పరుగులిచ్చి చెత్త రికార్డును నమోదు చేశాడు. తాజాగా ఆ పేలవ రికార్డుకు ఓ పరుగు ఎక్కువ ఇచ్చి మార్కో కూడా అందులో చేరాడు. కాగా, మార్కో బౌలింగ్‌పై ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కోచ్ మురళీధర్ ఆగ్రహం వ్యక్తం చేయడం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
-
beauty of IPL pic.twitter.com/Nswvs2domu
— best girl | IPL era (@awkdipti) April 27, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">beauty of IPL pic.twitter.com/Nswvs2domu
— best girl | IPL era (@awkdipti) April 27, 2022beauty of IPL pic.twitter.com/Nswvs2domu
— best girl | IPL era (@awkdipti) April 27, 2022
ఇదీ చూడండి: రషీద్, తెవాతియా మెరుపులు.. ఉత్కంఠ పోరులో గుజరాత్ విజయం