Gavaskar about Bhuvneshwar: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌తోపాటు వన్డే సిరీస్‌నూ టీమ్‌ఇండియా చేజార్చుకుంది. అన్ని విభాగాల్లోనూ భారత జట్టు తేలిపోయింది. ఈ నేపథ్యంలో రెండు మ్యాచుల్లో ఒక్క వికెట్ కూడా (0/64, 0/67) పడగొట్టలేక విఫలమైన బౌలర్ భువనేశ్వర్‌కు బదులు దీపక్ చాహర్‌ను జట్టులోకి తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు.
"భారత్ క్రికెట్‌కు భువనేశ్వర్ ఎంతో సేవ అందించాడు. అయితే కొన్నేళ్లు ఇటు జాతీయ స్థాయితోపాటు దేశవాళీలోనూ మెరుగ్గా రాణించలేకపోతున్నాడు. అతడు జట్టుకు భారంగా మారాడు. అద్భుతమైన యార్కర్లు, స్లో డెలివరీలను సంధించే భువనేశ్వర్ బౌలింగ్‌లో లయ కోల్పోయినట్లుగా ఉంది. ప్రత్యర్థులు తేలిగ్గా అంచనా వేసి పరుగులు రాబడుతున్నారు. అందుకే భువీ స్థానంలో వేరొకరిని ఎంపిక చేసుకోవాలని అవసరం ఉంది. దీపక్ చాహర్ అయితే ఇటు బ్యాటింగ్‌లోనూ అక్కరకొస్తాడు. అందుకే 2023 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని జట్టును సిద్ధం చేయాలి" అని గావస్కర్ సూచించాడు.
ఓడిపోవడానికి అదే కారణం
టీమ్‌ఇండియా ఓడిపోవడానికి అతి విశ్వాసమే ప్రధాన కారణమని సౌతాఫ్రికా మాజీ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ అభిప్రాయపడ్డాడు. "ఎవరి ప్రదర్శనను జడ్జ్ చేయడం లేదు. భారత్ టాప్ టీమ్. దక్షిణాఫ్రికా ఇప్పుడిప్పుడే కుర్రాళ్లతో ఎదుగుతున్న జట్టు. అయితే సఫారీలను టీమ్‌ఇండియా తక్కువ అంచనా వేసిందని మాత్రం చెప్పగలను. అతివిశ్వాసానికి పోయి ఓటమిని కొనితెచ్చుకున్నారు. ఇదే ప్రధాన కారణంగా భావిస్తున్నా" అని పేర్కొన్నాడు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!