ETV Bharat / sports

SRH Asst Coach Resign: సన్​రైజర్స్​​ సహాయ కోచ్​ రాజీనామా - సైమన్ కటిచ్​

SRH Asst Coach Resign: ఐపీఎల్ ​ 2022 ఆరంభం కాకముందే సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్టు సహాయ కోచ్ సైమన్ కటిచ్​ రాజీనామా చేశాడు. అయితే ఆయన రాజీనామాకు గల కారణాలను వెల్లడించలేదు.

srh asst coach simon katich
సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్టు సహాయ కోచ్ సైమన్ కటిచ్​
author img

By

Published : Feb 18, 2022, 11:06 AM IST

SRH Asst Coach Resign: ఐపీఎల్ ఆరంభం కాకముందే సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. జట్టు సహాయ కోచ్​ సైమన్​ కటిచ్​ తన పదవికి రాజీనామా చేశారు. దీనికి గల స్పష్టమైన కారణాన్ని కటిచ్​ వెల్లడించలేదు. 2022 మెగా వేలంలో జట్టు తీసుకున్న నిర్ణయాలే.. రాజీనామాకు కారణమని తెలుస్తోంది.

మెగా వేలంలో హైదరాబాద్ జట్టు తీసుకున్న కొన్ని నిర్ణయాలను కటిచ్​ అంగీకరించలేదు. జట్టు మాజీ కెప్టెన్​ డెవిడ్​ వార్నర్ రాజీనామాను ఫ్రాంఛైజీ పట్టించుకోకపోవడం వల్ల కూడా కటిచ్​ యాజమాన్యంపై అసంతృప్తితో ఉన్నారు.

ఆస్ట్రేలియాకే చెందిన మాజీ ఆటగాడు టామ్​ మూడీ సన్​రైజర్స్​​ జట్టుకు ప్రధాన కోచ్​గా వ్యవహరిస్తున్నాడు.

2021 ఐపీఎల్​లో సన్​రైజర్స్​ జట్టు ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. గతేడాది 14మ్యాచులాడిన ఎస్​ఆర్​హెచ్​ మూడింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంతో సీజన్​ను ముగించింది. జట్టు కెప్టెన్ డెవిడ్​ వార్నర్​ను అవమానకర రీతిలో పదవి నుంచి తొలగించింది. టోర్నమెంట్​ మధ్యలో పక్కకు పెట్టింది.

ఈ సారి జరిగిన మెగావేలంలో రూ.10.75 కోట్లు వెచ్చించి విండీస్​ ఆటగాడు నికోలస్​ పురన్​ను ఎస్ఆర్​హెచ్​ కొనుక్కుంది. ఆఫ్​ స్పిన్నర్​ వాషింగ్టన్ సుందర్​కు రూ.8.75 కోట్లు వెచ్చించింది. రోమారియో షెపర్డ్​, నటరాజన్​, మక్రమ్​, సీన్​ అబాట్​. రాహుల్ త్రిపాఠి. గ్లెన్​ పిలిప్స్​లను వేలంలో దక్కించుకుంది. ఐపీఎల్​ వేలానికి ముందే కేన్​ విలియమ్సన్​, అబ్దుల్​ సమద్, ఉమ్రన్​ మాలిక్​లను రిటెయిన్​ చేసుకుంది.

ఇదీ చదవండి: IPL: 'మహీ విశ్వాసాన్ని రైనా కోల్పోయాడు.. అందుకే అలా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.