ETV Bharat / sports

ఇంగ్లాండ్​ స్టార్​ ఆల్​రౌండర్ సంచలన నిర్ణయం..​ వన్డే క్రికెట్​కు గుడ్​బై - బెన్​స్టోక్స్​ రిటైర్మెంట్​

Benstokes retirement: ఇంగ్లాండ్​ స్టార్​ ఆల్​రౌండర్​ బెన్​స్టోక్స్​ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే క్రికెట్​కు వీడ్కోలు పలికాడు.

Ben Stokes announces retirement from ODI cricket.
బెన్​స్టోక్స్​ వన్డే క్రికెట్​కు వీడ్కోలు
author img

By

Published : Jul 18, 2022, 5:22 PM IST

Updated : Jul 18, 2022, 5:31 PM IST

Benstokes retirement: బెన్​స్టోక్స్​.. క్రికెట్​ గురించి తెలిసిన ప్రతిఒక్కరికీ ఈ పేరు తెలిసే ఉంటుంది. ఇంగ్లాండ్​ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ స్టార్​ ఆల్​రౌండర్​ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. మంగళవారం డర్హమ్​లో దక్షిణాఫ్రికాతో జరగబోయే మ్యాచ్​ తనకు చివరిదని తెలిపాడు. ఈ ఫార్మాట్‌లో జట్టుకు ఇకపై అత్యుత్తమ సేవలు అందించలేనని పేర్కొన్నాడు. తనకు ఇన్నేళ్ల పాటు అండగా ఉన్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. ఇకపై నుంటి టీ20, టెస్టుపై పూర్తిగా దృష్టి పెడతానని చెప్పుకొచ్చాడు.

"మంగళవారం డర్హమ్​లో నా చివరి మ్యాచ్​ను ఆడతాను. ఆ తర్వాత ఈ ఫార్మాట్​కు వీడ్కోలు పలుకుతాను. ఈ నిర్ణయం ఎంతో కఠినమైనది. నా తోటి ప్లేయర్స్​తో ఆడిన ప్రతిక్షణాన్ని ఎంతో ఆస్వాదించా. ఈ ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగింది." అని అన్నాడు. కాగా, 2019 వన్డే ప్రపంచకప్‌ గెలవడంలో బెన్‌స్టోక్స్‌ కీలక పాత్ర పోషించాడు. అయితే, ఇటీవల అతడు టీమ్‌ఇండియాతో ఆడిన వన్డే సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.

Last Updated : Jul 18, 2022, 5:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.