ETV Bharat / sports

భారత మహిళల జట్టు బ్యాటింగ్ కోచ్​గా​ దాస్​

భారత మహిళల క్రికెట్​ బ్యాటింగ్ కోచ్​గా మాజీ క్రికెటర్​ శివ సుందర్ దాస్​ నియామకమయ్యాడు. జాతీయ క్రికెట్ అకాడమీలో పని చేసిన అనుభవం తనకు ఈ విధంగా కలిసొచ్చిందని దాస్​ సంతోషం వ్యక్తం చేశాడు.

shiv sunder das, indian womens team batting coach
శివ సుందర్ దాస్, భారత మహిళల బ్యాటింగ్ కోచ్
author img

By

Published : May 17, 2021, 10:36 PM IST

ఇంగ్లాండ్​ టూర్​కు ముందు భారత మహిళల క్రికెట్​కు శుభవార్త చెప్పింది బీసీసీఐ. భారత మాజీ ఓపెనర్​ శివ సుందర్ దాస్​.. భారత మహిళల క్రికెట్ టీమ్​ బ్యాటింగ్ కోచ్​గా ఎంపికయ్యాడు. రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్​సీఏ)లో పనిచేసిన అనుభవం తనకు ఈ విధంగా ఉపయోగపడిందని దాస్​ తెలిపాడు.

"గత నాలుగైదు ఏళ్లుగా ఎన్​సీఏలో భాగంగా ఉన్నాను. గత కొన్నేళ్లుగా బ్యాటింగ్ కోచ్​గా పనిచేస్తున్నాను. నాపై నమ్మకముంచి నాకు ఈ అవకాశమిచ్చిన రాహుల్ ద్రవిడ్, సౌరభ్ గంగూలీకి ధన్యవాదాలు"

-శివ సుందర్ దాస్, మాజీ భారత క్రికెటర్.

2000-02 మధ్య భారత్​కు ప్రాతినిధ్యం వహించాడు ఎస్ఎస్ దాస్. 23 టెస్టులు ఆడిన అతడు 35కి పైగా సగటుతో 1300 పరుగులు సాధించాడు. అందులో రెండు సెంచరీలు, తొమ్మిది అర్ధ శతకాలు ఉన్నాయి.

గతంలో అంతర్జాతీయ స్థాయిలో, లీగ్ స్థాయిలో​ ఇంగ్లాండ్​లో క్రికెట్ ఆడిన అనుభవం ప్రస్తుతం ఉపయోగపడనుందని దాస్ పేర్కొన్నాడు. అక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉందని చెప్పాడు. 2002 టెస్టు సందర్భంగా ఇంగ్లాండ్​పై 250 పరుగులు చేశాడు. ​సుదీర్ఘ ఫార్మాట్​లో తనకిదే అత్యధిక స్కోరని వెల్లడించాడు.

ఇదీ చదవండి: 'ఆస్ట్రేలియన్ ఓపెన్​ నిర్వహణకు మేం రెడీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.