స్లో ఓవర్ రేట్ కారణంగా శ్రీలంక క్రికెటర్ల మ్యాచ్ ఫీజులో 20శాతం కోత పడింది. మంగళవారం టీమ్ఇండియాతో జరిగిన రెండో వన్డేలో నిర్ణీత సమయానికి ఒక ఓవర్ తక్కువగా బౌలింగ్ వేసింది లంక జట్టు. దీంతో ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో కోత విధిస్తూ ఐసీసీ మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగల్లె నిర్ణయం తీసుకున్నారు.
స్లో ఓవర్ రేటు కారణంగా శ్రీలంక జట్టుకు చెందిన సూపర్‌లీగ్ పాయింట్లపై కూడా ప్రభావం పడనుంది. "ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్ సూపర్‌లీగ్ ఆటగాళ్ల నిబంధనల ప్రకారం స్లో-ఓవర్ రేటులో ప్రతి ఒవర్‌కు ఒక సూపర్‌లీగ్ పాయింట్‌ను తగ్గించాలి. ఈ నేపథ్యంలో లంక జట్టుకు ఒక పాయింట్ పెనాల్టీ పడింది," ఐసీసీ పాలకవర్గం వెల్లడించింది.
ఇదీ చూడండి.. చాహర్ వీరోచిత ఇన్నింగ్స్.. టీమ్ఇండియాదే సిరీస్