ETV Bharat / sports

బయోబబుల్ అతిక్రమణ.. క్రికెటర్లపై నిషేధం

author img

By

Published : Jun 28, 2021, 2:51 PM IST

Updated : Jun 28, 2021, 9:21 PM IST

ఇంగ్లాండ్ పర్యటనలో బయోబబుల్​ నిబంధనల్ని ఉల్లంఘించిన శ్రీలంక క్రికెటర్లను టోర్నీ నుంచి నిషేధించింది లంక బోర్డు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న డర్హమ్​లో బయట తిరుగుతూ కనిపించిన వీరిపై విచారణకు ఆదేశించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.

Kusal Mendis
కుశాల్ మెండిస్

ఇంగ్లాండ్​ పర్యటనలో బయో బబుల్​ను అతిక్రమించిన శ్రీలంక ఆటగాళ్లపై చర్యలు చేపట్టింది ఆ దేశ క్రికెట్​ బోర్డు. వైస్​ కెప్టెన్ కుశాల్ మెండిస్, వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెలా, ధనుష్క గుణతిలకను టోర్నీ నుంచి సస్పెండ్ చేసింది. వారిని తక్షణమే స్వదేశానికి రావాల్సిందిగా బోర్డు ఆదేశించింది.

ఏం జరిగిందంటే..

ఇటీవలే జరిగిన టీ20 టోర్నీలో 3-0తో ఓడిపోయింది లంక జట్టు. కరోనా కారణంగా ఆటగాళ్లు ఏ పర్యటనలో అయినా బయోబుడగలో ఉండాల్సిందే. కానీ లంక క్రికెటర్లు ఇద్దరు మాత్రం బయట తిరుగుతూ కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఇంగ్లాండ్​లోని ఓ మార్కెట్​లో లంక వైస్ కెప్టెన్ కుశాల్ మెండిస్(Kusal Mendis), వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెలా(Niroshan Dickwella) తిరుగుతూ కనిపించారు. ఈ ఫొటోలు, వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. వారు మాస్క్​ కూడా పెట్టుకోకపోవడం చర్చకు దారితీసింది. దీనిపై స్పందించిన నెటిజన్లు బయోబబుల్​లో ఉండాల్సిన ఆటగాళ్లు బయటకు ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. దీంతో ఆ దేశ బోర్డు విచారణకు ఆదేశించింది. చివరికి వారిని సస్పెండ్​ చేసింది.

ఇవీ చూడండి: Team India: టీమ్​ఇండియా.. మరో ఛాలెంజ్​కు సిద్ధం

Last Updated : Jun 28, 2021, 9:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.