Sri Lanka Bangladesh Controversy : దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన శ్రీలంక- బంగ్లాదేశ్ మ్యాచ్‌లో జరిగిన ఏంజెలో మ్యాథ్యూస్ టైమ్డ్ ఔట్ గురించి ఇంకా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ విషయంపై పలువురు మాజీలు స్పందించగా.. తాజాగా షకీబ్ అల్ హసన్ మీద ఏంజెలో మ్యాథ్యూస్ సోదరుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. షకీబ్ మ్యాచ్ ఆడేందుకు శ్రీలంకకు వస్తే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని..అతనిపై రాళ్లదాడి తప్పదంటూ హెచ్చరించాడు.
"ఈ విషయంలో మేము చాలా నిరుత్సాహానికి గురయ్యాం. బంగ్లాదేశ్ కెప్టెన్ తన క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించలేదు. జెంటిల్‌మెన్ గేమ్‌లో కనీస మానవత్వంతో వ్యవహరించలేదు. అందుకే షకీబ్‌ను శ్రీలంకలోకి స్వాగతించం. ఒకవేళ అతను ఏదైనా మ్యాచ్ లేదా లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు ఇక్కడకు వస్తే అభిమానులు కచ్చితంగా అతనిపై రాళ్లు విసురుతారు. ఈ విషయంలో అతను చాలా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది" అని మాథ్యూస్ సోదరుడు వ్యాఖ్యానించాడు.
ఇదీ జరిగింది..
BAN Vs SL World Cup 2023 : శ్రీలంక బ్యాటర్ సధీర సమరవిక్రమ 24.2 ఓవర్లో షకీబ్ బౌలింగ్ ఔట్ అయిన తర్వాత.. ఆల్‌రౌండర్ మాథ్యూస్ బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. ఈ క్రమంలో మాథ్యూస్.. దాదాపు దాదాపు 120 సెకన్ల తర్వాత క్రీజులోకి వచ్చాడు. అయితే బ్యాటర్ క్రీజులోకి ఆలస్యంగా వచ్చాడంటూ.. అతడ్ని టైమ్డ్ ఔట్‌గా ప్రకటించాలని బంగ్లా ఆటగాళ్లు అప్పీల్ చేశారు. దీంతో మాథ్యూస్‌పై టైమ్డ్ ఔట్ వేటు వేశారు అంపైర్లు. అయితే తాను ధరించే హెల్మెట్ పట్టీలు బాగా లేవని.. దానిని మార్చుకునే క్రమంలోనే బ్యాటింగ్‌కు రావడం ఆలస్యమైందని మాథ్యూస్ మైదానంలో ఉన్న అంపైర్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ అతడి వాదనను అంపైర్లు ఎరాస్మస్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ పట్టించుకోలేదు. దీంతో మాథ్యూస్ బ్యాటింగ్ చేయకుండానే పెవిలియన్ బాట పట్టాడు. ఆ సమయంలో 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది.
మరోవైపు ఈ విషయంపై మ్యాచ్ తర్వాత బంగ్లా కెప్టెన్ షకీబ్ స్పందించాడు. తాను యుద్ధంలో ఉన్నట్లు భావించానని.. అందుకే తనకు అనిపించింది తాను చేయాల్సి వచ్చిందన్నాడు. ఈ విషయంపై ఎన్నో విమర్శలు వస్తాయని అవన్నీ తాను పట్టించుకోనని చెప్పాడు. అయితే తమ విజయానికి టైమ్డ్ ఔట్ సాయం చేసిందని తెలిపాడు. ఇందులో దాచడానికి ఏమీ లేదని షకీబ్ స్పష్టం చేశాడు.
టైమ్డ్ అవుట్, హ్యాండిల్డ్ బాల్ - క్రికెట్‌లో ఎన్ని విధాలుగా ఔటవుతారో తెలుసా?
'నేను యుద్ధంలో ఉన్నాను, అవన్నీ పట్టించుకోను'- టైమ్డ్ ఔట్‌పై ముదిరిన వివాదం!