AB De Villiers Racism: తన ఆటతో ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ గతంలో సహచర నల్లజాతి ఆటగాడిపై జాతి వివక్ష చూపాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతనితో పాటు మాజీ ఆటగాళ్లు గ్రేమ్ స్మిత్, మార్క్ బౌచర్‌తో సహా క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ) బోర్డు గతంలో కొంతమంది నల్ల జాతీయులైన క్రికెటర్ల పట్ల పక్షపాతం ప్రదర్శించారని సామాజిక న్యాయం, దేశ నిర్మాణం (సోషల్ జస్టిస్ అండ్ నేషన్ బిల్డింగ్- ఎస్‌జేఎన్) కమిషన్ తన నివేదికలో వెల్లడించింది. 235 పేజీలతో కూడిన తుది నివేదికను అది సీఎస్‌ఏకు అందజేసింది. అందులో సీఎస్‌ఏ పాలన విభాగం, దాని ప్రస్తుత డైరెక్టర్ స్మిత్, జట్టు ప్రధాన కోచ్ బౌచర్, డివిలియర్స్ గతంలో నల్లజాతి ఆటగాళ్లపై అన్యాయంగా వివక్ష చూపారని పేర్కొంది.
జట్టు కోసం..
-
I support the aims of CSA’s Social Justice and Nation Building process, to ensure equal opportunities in cricket. However, in my career, I expressed honest cricketing opinions only ever based on what I believed was best for the team, never based on anyone’s race. That’s the fact. pic.twitter.com/Be0eb1hNBR
— AB de Villiers (@ABdeVilliers17) December 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">I support the aims of CSA’s Social Justice and Nation Building process, to ensure equal opportunities in cricket. However, in my career, I expressed honest cricketing opinions only ever based on what I believed was best for the team, never based on anyone’s race. That’s the fact. pic.twitter.com/Be0eb1hNBR
— AB de Villiers (@ABdeVilliers17) December 15, 2021I support the aims of CSA’s Social Justice and Nation Building process, to ensure equal opportunities in cricket. However, in my career, I expressed honest cricketing opinions only ever based on what I believed was best for the team, never based on anyone’s race. That’s the fact. pic.twitter.com/Be0eb1hNBR
— AB de Villiers (@ABdeVilliers17) December 15, 2021
కానీ ఈ ఆరోపణలను డివిలియర్స్ ఖండించాడు. "క్రికెట్లో సమాన అవకాశాలు కల్పించేలా సీఎస్‌ఏకు చెందిన ఎస్‌జేఎన్ కమిషన్ లక్ష్యానికి నా మద్దతు ఉంటుంది. నా కెరీర్‌లో జట్టుకు ఏది ఉత్తమమో దాని కోసం నా నిజమైన అభిప్రాయాలను వ్యక్తపరిచా కానీ ఏ ఆటగాడి జాతిని చూసి కాదు. అదే నిజం" అని ఏబీ ట్వీట్ చేశాడు. 2015లో భారత పర్యటనకు వచ్చిన వన్డే జట్టులో ఓ మ్యాచ్ కోసం గాయపడ్డ డుమిని స్థానంలో ఖాయా జోండోకు బదులు ఎల్గర్‌ను తీసుకోవడం ఇప్పుడు డివిలియర్స్‌పై ఆరోపణలకు కారణమైంది.
మరోవైపు 2012లో బౌచర్ రిటైర్మెంట్ తర్వాత థామి సోలెకిలెని జట్టులోకి ఎంపిక చేయకపోవడానికి కారణం విధానపరమైన జాతి వివక్షకు సూచన అని ఎస్‌జేఎన్ తన నివేదికలో తెలిపింది. సీఎస్‌ఏ, స్మిత్‌తో పాటు కొంతమంది సెలక్టర్లు నల్ల జాతీయుల పట్ల వివక్ష చూపారని పేర్కొంది.
ఇవీ చూడండి:
మరోసారి సంక్షోభంలోకి దక్షిణాఫ్రికా క్రికెట్!