ETV Bharat / sports

'బుమ్రా కంటే సిరాజే ముందుంటాడు' - మహమ్మద్ సిరాజ్

బౌలింగ్​లో వైవిధ్యం పరంగా చూస్తే బుమ్రా కంటే మహమ్మద్ సిరాజ్​ముందుటాడని అన్నాడు మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా. అతడు ప్రస్తుతం.. ఫిట్​నెస్​పై దృష్టి సారించడం సహా చురుగ్గా వ్యవహరించాలని సూచించాడు.

Siraj is ahead of Bumrah, says Nehra
బుమ్రా కంటే సిరాజే ముందుంటాడు
author img

By

Published : Apr 25, 2021, 6:47 AM IST

ఫాస్ట్​బౌలింగ్​ నైపుణ్యాలు.. ముఖ్యంగా వైవిధ్యం పరంగా చూస్తే బుమ్రా కంటే మహమ్మద్ సిరాజే ముందుంటాడని టీమ్​ఇండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్​ ఐపీఎల్​లో బెంగళూరు తరపున ఇప్పటివరకు 4 మ్యాచ్​ల్లో 5 వికెట్లు తీసిన సిరాజ్​.. పరుగుల కట్టడిలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నాడు.

"రెండేళ్ల క్రితం భారత్-ఎ తరపున ఎర్రబంతితో ఆడిన ప్రతి మ్యాచ్​లోనూ అయిదారు వికెట్లు పడగొడుతున్నాడని సిరాజ్ గురించి చర్చ సాగింది. ఇప్పుడతను అన్ని ఫార్మాట్లలో మంచి బౌలర్​గా ఎదుగుతున్నాడు. అతనిలో నైపుణ్యాలకు కొదవలేదు. బౌలింగ్​లో అన్ని రకాల వైవిధ్యాలు ప్రదర్శిస్తున్నాడు. నిజానికి నైపుణ్యాల గురించి మాట్లాడితే.. వైవిధ్యం పరంగా చూస్తే బుమ్రా కంటే అతనే ముందుంటాడు. స్లో డెలివరీలు తెలివిగా వేయగలడు. వేగాన్ని కొనసాగించగలడు. కొత్త బంతిని కదిలించగలడు. అతనిప్పుడు ఫిట్​నెస్​పై దృష్టిపెట్టడం సహా మెదడును చురుగ్గా ఉంచుకోవాలి. ఈ రెండు విషయాలను సమర్థంగా చేస్తే అతనికిక ఆకాశమే హద్దు."

- ఆశిష్ నెహ్రా, టీమ్​ఇండియా మాజీ బౌలర్

నెహ్రా.. గతంలో ఐపీఎల్​లో ఆర్​సీబీ తరపున ఆడాడు.

ఇదీ చూడండి: సీఎస్కేxఆర్సీబీ: ఆధిపత్యం కొనసాగించేది ఎవరో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.