Shubman Gill Fever : 2023 ప్రపంచకప్ గురువారం ప్రారంభమైంది. అయితే ఇటీవల గాయాల నుంచి కోలుకున్న టీమ్ఇండియాకు.. తాజాగా షాక్ తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో గిల్.. అక్టోబర్ 8న భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చునని సమాచారం. ఒకవేళ గిల్, భారత్ తొలి మ్యాచ్‌కు గైర్హాజరైతే.. అతడి స్థానంలో యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్.. రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంది.
"చెన్నైలో దిగినప్పటి నుంచి గిల్.. జ్వరంతో బాధపడుతున్నాడు. శుక్రవారం అతడికి వైద్య పరీక్షలు జరుగుతాయి. రిపోర్టుల అనంతరం అతడు ఆసీస్‌తో మ్యాచ్‌లో ఆడతాడా లేదా అనేది నిర్ణయిస్తాం" అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
అయితే గిల్ డెంగీ బారిన పడినట్లు కొన్ని కథనాలు వస్తున్నాయి. అదే నిజమైతే.. డెంగీ నుంచి కోలుకోవడానికి 7-10 రోజుల సమయం పట్టవచ్చు. దీంతో అతడు టోర్నీలో కొన్ని మ్యాచ్‌లకు దూరం అవుతాడు. ఒకవేళ అది వైరల్ ఫీవర్ అయితే.. గిల్ యాంటీబయెటిక్స్ తీసుకొని ఆడతాడు.
Shubman Gill ODI Stats : గిల్ ఈ ఏడాది కెరీర్ బెస్ట్ ఫామ్‌తో దూసుకుపోతున్నాడు. అతడు 2023లో ఇప్పటివరకు 20 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. అందులో 72.35 సగటున, 105 స్ట్రైక్ రేట్‌తో 1230 పరుగులు చేశాడు. ఇందులో 5 శతకాలు, 5 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక కెరీర్ బెస్ ఇన్నింగ్స్ డబుల్ సెంచరీ (208 పరుగులు) కూడా ఇదే ఏడాది బాదాడు. మొత్తం కెరీర్లో 35 ఇన్నింగ్స్‌లో 1917 పరుగులు సాధించాడు. ప్రస్తుతం గిల్ 839 రేటింగ్స్‌తో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
2023 ప్రపంచకప్‌నకు భారత్ జట్టు...
Team India Squad For World Cup 2023 : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్),రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, జన్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్.
ICC ODI Rankings 2023 : గిల్ ప్లేస్ నో ఛేంజ్.. మెరుగైన రోహిత్.. కోహ్లీ సెంచరీ కొట్టినా డౌన్