ETV Bharat / sports

చరిత్ర సృష్టించిన శ్రేయస్.. తొలి భారత ఆటగాడిగా! - శ్రేయస్ అయ్యర్ న్యూస్

Shreyas Iyer Record in Test Debut: న్యూజిలాండ్​తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్​లో అర్ధశతకంతో మెరిసిన టీమ్ఇండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఓ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. అరంగేట్ర టెస్టులోనే సెంచరీ, హాఫ్ సెంచరీ చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు.

shreyas
శ్రేయస్ అయ్యర్
author img

By

Published : Nov 28, 2021, 3:10 PM IST

Shreyas Iyer Record in Test Debut: న్యూజిలాండ్​తో జరుగుతున్న తొలి టెస్టులో అదరగొట్టాడు టీమ్ఇండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్. మొదటి ఇన్నింగ్స్​లో సెంచరీ (105) చేసిన ఈ యువ ఆటగాడు రెండో ఇన్నింగ్స్​లో ఒత్తిడిలోనూ రాణిస్తూ హాఫ్ సెంచరీ (65) పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ అరుదైన రికార్డును కైవసం చేసుకున్నాడు శ్రేయస్. అరంగేట్ర టెస్టులోనే శతకం, అర్ధ శతకం బాదిన తొలి భారత క్రికెటర్​గా చరిత్ర సృష్టించాడు.
అలాగే అరంగేట్ర టెస్టులోనే రెండు ఇన్నింగ్స్​లో 50కిపైగా పరుగులు సాధించిన మూడో భారత క్రికెటర్​గా నిలిచాడు శ్రేయస్. ఇంతకుముందు సునీల్ గావస్కర్ (1971లో), దిలావర్ హుస్సేన్ (1934లో) ఈ ఘనత సాధించారు.

ఇదీ చదవండి:

పుజారా, రహానే టెస్టు స్థానాలు ఇక గాల్లో దీపమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.