ETV Bharat / sports

'శ్రీలంకతో సిరీస్​లో ధావన్​ కెప్టెన్సీకే నా ఓటు' - శ్రీలంక పర్యటన ధావన్​ కెప్టెన్సీ

శ్రీలంక పర్యటనలో భారత జట్టుకు ధావన్​ సారథిగా వ్యవహరిస్తాడని తాను భావిస్తున్నట్లు చెప్పాడు టీమ్​ఇండియా మాజీ ఆటగాడు దీప్​దాస్​ గుప్తా. ఇంగ్లాండ్​ సిరీస్​కు భువనేశ్వర్​ ఎంపికవ్వకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదని చెప్పాడు. ​

dhawan
ధావన్​
author img

By

Published : May 11, 2021, 5:20 PM IST

శ్రీలంకలో పర్యటించే భారత జట్టు సారథి రేసులో శిఖర్‌ ధావన్‌, భువనేశ్వర్‌ కుమార్‌ ఉంటారని టీమ్ఇండియా మాజీ ఆటగాడు దీప్‌దాస్‌ గుప్తా అన్నాడు. ఇంగ్లాండ్‌ సిరీస్‌కు భువీ ఎంపికవ్వకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదని పేర్కొన్నాడు. అతడు రెండున్నరేళ్లుగా టెస్టు క్రికెట్‌ ఆడలేదని వెల్లడించాడు.

"విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ ఎలాగూ అందుబాటులో ఉండరు. ఆ తర్వాత అందుబాటులో ఉన్న సీనియర్‌ ఆటగాడు శిఖర్ ధావన్‌. కాబట్టి అతడు సారథి రేసులో ఉంటాడు. కెప్టెన్‌గా ఎవరుంటారన్న సందేహం ప్రస్తుతం అందరిలోనూ ఉంది. నేనైతే ధావన్‌ అనుకుంటున్నా. భువనేశ్వర్‌ ఫిట్‌గా ఉండి ఆడేందుకు సిద్ధమైతే అతడూ మంచి అభ్యర్థే" అని దీప్‌దాస్‌ అన్నాడు.

భువనేశ్వర్‌ ఇంగ్లాండ్‌ పర్యటనకు ఎంపికవ్వకపోవడంలో తనకేమీ ఆశ్చర్యం లేదని దీప్‌దాస్‌ గుప్తా చెప్పాడు. "ఆ సిరీస్‌కు ఆరుగురు పేసర్లు అందుబాటులో ఉన్నారు. ఆ పరిస్థితులు, పిచ్‌లు భువీ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటాయని తెలుసు. కానీ అతడు రెండున్నరేళ్లుగా సుదీర్ఘ ఫార్మాట్‌ ఆడలేదు. 2018 నుంచి ఫిట్‌నెస్‌ సమస్యలతో సతమతం అవుతున్నాడు. రంజీ క్రికెట్‌ కూడా ఆడలేదు. అతడి దేహం ఐదు రోజుల క్రికెట్‌ను భరిస్తుందో లేదో తెలియదు. శ్రీలంక టూర్​ను దృష్టిలో పెట్టుకొనే అతడిని ఎంపిక చేయలేదేమో" అని పేర్కొన్నాడు.

తొలిసారి భారత్‌ రెండు జట్లుగా విడిపోయి అంతర్జాతీయ క్రికెట్‌ ఆడబోతుంది. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌, బుమ్రా, షమీ సహా 20 మందితో కూడిన జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది. తెల్లబంతి స్పెషలిస్టులతో కూడిన జట్టు శ్రీలంకలో పర్యటిస్తుందని ఇటీవల బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ప్రకటించాడు.

ఇదీ చూడండి: శ్రీలంకతో సిరీస్​.. టీమ్​ఇండియా కెప్టెన్ ఎవరు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.