ETV Bharat / sports

Eng vs Ind: ఏడేళ్ల 'సుదీర్ఘ' నిరీక్షణకు తెర

సుదీర్ఘ విరామం అనంతరం మళ్లీ టెస్టు క్రికెట్ ఆడనుంది భారత మహిళల క్రికెట్ జట్టు. ఇంగ్లాండ్​ జట్టుపై అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైంది. అన్నీ అనుకూలంగానే ఉన్నా.. ప్రాక్టీస్ మ్యాచ్​లు లేకపోవడం టీమ్​ఇండియాకు ఇబ్బందిగా మారింది. గతంలో ఇదే ఇంగ్లాండ్ వేదికగా జరిగిన టెస్టులో భారత్​ ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. మరి నేటి నుంచి ప్రారంభం కానున్న నాలుగు రోజుల మ్యాచ్​లో మిథాలీ సేన ఏం చేస్తుందో చూడాలి.

Eng vs Ind W,  Indian women return to Test cricket
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్, ఏడేళ్ల నిరీక్షణ తర్వాత టెస్ట్​ల్లోకి భారత్
author img

By

Published : Jun 16, 2021, 5:32 AM IST

ఏడేళ్ల నిరీక్షణ అనంతరం భారత మహిళల జట్టు తిరిగి టెస్టు​ క్రికెట్​ ఆడబోతోంది. ఇంగ్లాండ్​లో మెరుగైన గత రికార్డులతో పాటు ఆటగాళ్లలో సానుకూల దృక్పథం ఉన్నప్పటికీ.. టెస్టుకు ముందు తగినంత ప్రాక్టీస్ లేకపోవడం టీమ్ఇండియాను కలవరపెడుతోంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభంకానుంది.

భారత్​తో పాటు యూకేలో పలు క్వారంటైన్​ల తర్వాత మిథాలీ సేన ఏకైక టెస్టు కోసం వేచి చూస్తోంది. చివరగా 2014 నవంబర్​లో సుదీర్ఘ ఫార్మాట్​ను ఆడింది టీమ్ఇండియా. మైసూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఆ టెస్టులో భారత మహిళా జట్టు ఘన విజయం సాధించింది. అప్పటి టీమ్​లో ఉన్న సభ్యులలో ఏడుగురు ప్రస్తుత జట్టులో ఉండడం పర్యాటక జట్టుకు సానుకూలాంశం.

ప్రాక్టీస్​ మ్యాచ్​ లేకపాయే..

కెప్టెన్ మిథాలీతో పాటు వైస్ కెప్టెన్ హర్మన్​ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, సీనియర్​ బౌలర్ జులాన్ గోస్వామి.. ఇటీవల కాలంలో సుదీర్ఘ ఫార్మాట్​ ఆడలేదు. ఇక ఫస్ట్​క్లాస్​ క్రికెట్ కూడా ఆడని మిగిలిన క్రికెటర్లకూ ప్రస్తుత మ్యాచ్​ కఠిన పరీక్ష లాంటిదనే చెప్పొచ్చు.

ఇదీ చదవండి: WTC Final: 'అలా అయితే టీమ్ఇండియానే విజేత'

ఇదే ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న పురుషుల జట్టు.. కనీసం ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్​తోనైనా ప్రాక్టీస్ చేయగలిగింది. కానీ, మహిళల జట్టుకు ఆ పరిస్థితి కూడా లేదు. వారు కేవలం నెట్​ సెషన్లకే పరిమితమయ్యారు. దీంతో సుదీర్ఘ కాలం తర్వాత పాల్గొనబోతున్న క్రికెటర్లకు నాలుగు రోజుల ఆటలో కొంత ఇబ్బంది కలగక తప్పదు.

"ప్లేయర్లు మంచి స్థితిలో ఉన్నారు. కావాల్సినంత శిక్షణ సమయం ఉంది. కానీ, ప్రాక్టీస్ మ్యాచ్ ఉంటే బాగుండేది. అది వన్డే మ్యాచ్​ అయినా నాలుగు రోజుల మ్యాచ్ అయినా. బౌలింగ్, బ్యాటింగ్​ల్లో ఒత్తిడిని జయించాలంటే ప్రాక్టీస్ మ్యాచ్​ అవసరం. ఇది టెస్టు కాబట్టి, వారు సుదీర్ఘ కాలం బ్యాటింగ్ చేయగల అవకాశం ఉందా? అదేవిధంగా బౌలింగ్​తో పాటు వికెట్లు తీయగల సత్తా ఉందా? అనేది ప్రాక్టీస్ మ్యాచ్​తో రూఢీ అవుతుంది" అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.

ఏకైక టెస్టు మ్యాచ్​పై హర్మన్​ప్రీత్ కౌర్ స్పందించింది. మ్యాచ్​కు సన్నద్ధమవ్వడానికి సమయం తక్కువ ఉన్నప్పటికీ.. తాము మానసికంగా ఎప్పుడో ప్రిపేర్ అయ్యామని తెలిపింది. కొన్ని విలువైన సూచనలను టీమ్ఇండియా వైస్ కెప్టెన్ రహానె నుంచి తెలుసుకున్నట్లు వెల్లడించింది.

షెఫాలీకి మంచి అవకాశం..

మంధానతో కలిసి ఇన్నింగ్స్​ను ప్రారంభించనున్న యువ ఓపెనర్​ షెఫాలీ వర్మకు ఇది మంచి అవకాశమని చెప్పొచ్చు. ఆమె ఆట టాపార్డర్​పై ప్రభావం చూపుతుందనడంలో సందేహమే లేదు. ఇక అనుభవ త్రయం మిథాలీ, హర్మన్​ప్రీత్​, పూనమ్​ రౌత్​.. ఇంగ్లాండ్ పరిస్థితుల్లో తమ వంతు పాత్ర పోషించాలి. బౌలర్లు జులాన్ గోస్వామి, శిఖా పాండే సుదీర్ఘ స్పెల్​లు వేయగలరా లేదా అనేది చూడాలి. ఇక దక్షిణాఫ్రికాతో సిరీస్​లో స్వదేశంలో రాణించిన స్పిన్నర్లు ఎంత మేరకు రాణిస్తారో చూడాలి.

ఇదీ చదవండి: WTC Final: కివీస్​తో ఫైనల్​ కోసం భారత జట్టు ఇదే

భారత్ ఫెవరేటే కానీ..

2014 ఆగస్ట్​లో భారత్​తో జరిగిన టెస్ట్​లో ఇంగ్లాండ్​కు ప్రాతినిధ్యం వహించిన ఆల్​రౌండర్​ నాట్ స్కైవర్​.. ప్రస్తుతం జట్టులో వైస్​ కెప్టెన్​గా వ్యవహరిస్తుంది. నాటి మ్యాచ్​లో భారత్​ ఆరు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. రాబోయే టెస్ట్​లో ఇంగ్లాండ్ ఫెవరేట్​గా బరిలోకి దిగుతున్నప్పటికీ.. టీమ్ఇండియా నిర్భయంగా ఆడనుండటం వల్ల సవాలు తప్పదని స్కైవర్ భావిస్తోంది.

"టీమ్ఇండియా ఎప్పటికప్పుడు మెరుగవుతూనే ఉంది. జట్టులో యువ ఆటగాళ్లు ఉన్నారు. వారి ప్రదర్శన పట్ల వారెప్పుడు భయపడరు. గతంలో చూసిన దానికంటే ప్రస్తుత జట్టు మరింత నిర్భయంగా తయారైంది. అనుభవజ్ఞులైన కెప్టెన్​తో పాటు సీనియర్ బౌలర్​ గోస్వామి వారికి అదనపు బలం. పరిస్థితులు మాత్రమే మాకు అనుకూలంగా ఉన్నాయి. గతంలో మేము భారత్​తో టెస్ట్​ మ్యాచ్​ ఆడినప్పుడు దానిని మేము కోల్పోయాము. ఈ సారి అలా జరగకుండా చూసుకుంటాం."

-నాట్ స్కైవర్, ఇంగ్లాండ్ వైస్ కెప్టెన్.

ఇదీ చదవండి: SL vs IND: క్వారంటైన్​ కోసం ముంబయికి ధావన్​సేన

జట్లు..

టీమ్ఇండియా:

మిథాలీ రాజ్(కెప్టెన్), స్మృతి మంధాన, హర్మన్​ప్రీత్ కౌర్(వైస్ కెప్టెన్), పూనమ్ రౌత్, ప్రియా పూనియా, దీప్తి శర్మ, జెమ్మియా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, స్నేహ్​ రానా, తానియా భాటియా(వికెట్ కీపర్), ఇంద్రాణీ రాయ్, జులాన్ గోస్వామి, శిఖా పాండే, పుజా వాస్ట్రాకర్, అరుంధతి రెడ్డి, పూనమ్ యాదవ్, ఏక్తా బిష్ట్, రాధా యాదవ్.

ఇంగ్లాండ్:

హీథర్ నైట్(కెప్టెన్), ఎమిలీ అర్లోట్, టమ్మీ బ్యూమంట్, కాథరిన్ బ్రంట్, కేట్ క్రాస్, ఫ్రేయా డేవిస్, సోఫియా దుంక్లే, సోఫి ఎక్లేస్టోన్, జార్జియా ఎల్విస్, టష్ ఫర్రాంట్, సారా గ్లెన్, అమీ జోన్స్, నాట్ స్కైవర్(వైస్ కెప్టెన్), అన్యా శ్రుభ్సోల్, మ్యాడీ విల్లిర్స్, ఫ్రాన్ విల్సన్, లారెన్ విన్​ఫీల్డ్​ హిల్.

ఇదీ చదవండి: WTC Final: 'ఇంగ్లాండ్​తో సిరీస్ వల్ల కివీస్​కు లాభం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.