ETV Bharat / sports

IPL 2023: క్రికెట్​లో మరో మెగాలీగ్​.. బీసీసీఐ ఓకే అంటే ఆ స్టార్​ ప్లేయర్స్ బరిలోకి! - సౌదీ అరేబియాలో ఐపీఎల్​ తరహాలో లీగ్​

సౌదీలో బిగ్గెస్ట్ టీ20 లీగ్ ప్రారంభించాలని అక్కడి ప్రతినిధులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఐసీసీతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..

Saudi Arabia Wants IPL Owners To Set Up Worlds Richest T20 League In Country
క్రికెట్​లో మరో మెగాలీగ్​.. బీసీసీఐ ఓకే అంటే ఆ స్టార్​ ప్లేయర్స్ బరిలోకి!
author img

By

Published : Apr 14, 2023, 2:10 PM IST

ఐపీఎల్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రిచెస్ట్​ లీగ్​గా పేరొందిన ఈ మెగాటోర్నీని ప్రపంచ క్రికెట్ బోర్డులలో సంపన్న బోర్డుగా పేరు గాంచిన బీసీసీఐ ఆధ్వర్యంలో నడుస్తోంది. అయితే ఇప్పుడు ఈ ఐపీఎల్​ లీగ్ ఫ్రాంచైజీలకు శుభవార్త! సౌదీ అరేబియాలో ప్రపంచంలోనే అతిపెద్ద రిచెస్ట్ ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే లీగ్​ నిర్వహణపై ఐపీఎల్ యజమానులతో సౌదీ ప్రతినిథులు చర్చలు సాగించినట్టు సమాచారం. త్వరలోనే కార్యరూపం దాల్చనుందట.

ఈ విషయం గురించి పలు ఇంగ్లీష్ వైబ్​సైట్లతో కథనాలు వస్తున్నాయి. సౌదీ అరేబియాలో క్రికెట్​ను ప్రోత్సహించేందుకు.. ఐపీఎల్ తరహాలో భారీ టీ20లీగ్​ను నిర్వహించాలని అనుకుంటున్నారట. ఏడాది క్రితం నుంచే సౌదీ.. ఈ విషయమై గ్రౌండ్ వర్క్ చేస్తోందట. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది నుంచే ఈ టీ20 లీగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఫ్రాంచైజీలకు భారీగా రాయితీలు.. తమ దేశంలో నిర్వహించబోయే ఈ క్రికెట్ లీగ్​లో ఫ్రాంచైజీలను కొనుగోలు చేసేందుకు ముందుకు రావాలని, ఇందుకోసం రాయితీలను కూడా ఇచ్చేందుకు సౌదీ ప్రభుత్వం సిద్ధమైనట్టు కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే ఐపీఎల్​లోని చాలా ఫ్రాంచైజీలు.. వివిధ దేశాల్లో జరుగుతున్న లీగ్స్​లో భాగస్వామ్యమయ్యాయి. అందుకే సౌదీలో కూడా వారితోనే ఈ టీ20 లీగ్​ను నిర్వహించేలా అక్కడి ప్రతినిధులు ప్రణాళికలు రచిస్తున్నారట. అయితే ఇది ఇంకా ప్రస్తుతం చర్చల దశలోనే ఉంది. కాగా, ఏ దేశంలోనైనా ఫ్రాంచైజీ లీగ్ నిర్వహించాలంటే ఐసీసీ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. అందుకే ఐసీసీతోనూ సౌదీ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారట.

ఇకపోతే భారత క్రికెటర్లకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ తెలిసిందే. వారికి వరల్డ్ వైడ్​గా అభిమానులు ఉంటారు. ఈ లీస్ట్​లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ధోనీ, హార్దిక్​ పాండ్య, రిషభ్ పంత్ సహా పలువురు ఆటగాళ్లు ముందు వరుసలో ఉంటారు. అయితే భారత ఆటగాళ్లను.. ఇతర దేశ ఫ్రాంచైజీ లీగ్​లో ఆడేందుకు బీసీసీఐ అనుమతి ఇవ్వదు. కానీ ఇప్పుడు సౌదీ ప్రతినిధులు.. బీసీసీఐతో మాట్లాడి.. ఎలాగైనా భారత ప్లేయర్లను తమ లీగ్​లో ఆడేలా ఒప్పించాలని ప్రయత్నాలు చేసేందుకు ఆలోచిస్తుందట. చూడాలి మరి ఏం జరుగుతుందో..

ప్రస్తుతం భారత్​లో ఐపీఎల్​ 2023 సీజన్​ రసవత్తరంగా సాగుతోంది. హోరా హోరీగా సాగుతున్న ఈ మ్యాచ్​ల్లో ఇప్పటివరకు ఆడిన అందరూ తమ గేమ్​తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఈ మ్యాచ్​లను తిలకించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు వస్తున్నారు. ఇక వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా మ్యాచ్​లకు హాజరై స్టేడియంలో సందడి చేస్తున్నారు.

ఇదీ చూడండి: IPL 2023 PBKS VS GT : మ్యాచ్​లో సామ్​ కరణ్​ను ఎంకరేజ్​ చేసిన ఆ అందం ఎవరబ్బా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.