ETV Bharat / sports

హర్లీన్‌ కౌర్ అద్భుత క్యాచ్​​పై దిగ్గజాల ప్రశంసలు - హర్లీన్‌ కౌర్ సూపర్​ క్యాచ్​పై మిథాలీ రాజ్​​ ప్రశంస

ఇంగ్లాండ్​తో జరిగిన తొలి టీ20లో కనీవినీ ఎరగని రీతిలో క్యాచ్‌ పట్టుకుని సామాన్యుల నుంచి దిగ్గజాల వరకు అందరీ దృష్టినీ ఆకర్షించింది టీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ హర్లీన్‌ డియోల్‌(Harleen Deol). ఈ క్రమంలో వీరంతా ఆమెపై సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశంసిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఇంతకీ ఎవరెవరు ఏమన్నారంటే?

Harleen
హర్లీన్‌ కౌర్​
author img

By

Published : Jul 10, 2021, 8:08 PM IST

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో వారెవ్వా అనిపించే క్యాచ్‌పట్టి అందరి దృష్టినీ ఆకర్షించిన టీమ్‌ఇండియా మహిళా క్రికెటర్‌ హర్లీన్‌ కౌర్‌ డియోల్‌ను(Harleen Deol) పలువురు ప్రముఖులు ప్రశంసించారు. చురుకుదనంతో ఆమె పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌, కేంద్ర మంత్రి స్మృతి ఇరాని, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర సైతం ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే హర్లీన్‌ను మెచ్చుకుంటూ వారంతా ట్వీట్లు చేశారు.

ఇంగ్లాండ్‌తో తొలి టీ20 సందర్భంగా హర్లీన్‌ గతరాత్రి అమీజోన్స్‌ (43; 27 బంతుల్లో 4×4, 2×6) అనే ఇంగ్లిష్‌ బ్యాటర్‌ను బౌండరీ లైన్‌వద్ద క్యాచ్‌ అందుకొని పెవిలియన్‌ పంపించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు బ్యాటింగ్‌ చేస్తుండగా శిఖాపాండే వేసిన 18.5 ఓవర్‌కు అమీజోన్స్‌ లాంగాఫ్‌ మీదుగా భారీ షాట్ ఆడడం వల్ల మ్యాచ్‌ చూస్తున్నవారంతా బంతి సిక్స్‌ర్‌గా వెళ్తుందని భావించారు. కానీ, అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న హర్లీన్‌ చివరి క్షణాల్లో అథ్లెటిక్స్‌ విన్యాసాలు చేస్తూ క్యాచ్‌ అందుకొని వారెవ్వా అనిపించింది. బౌండరీ లైన్‌ వద్ద గాల్లోకి ఎగురుతూ తొలుత బంతిని అందుకున్న ఆమె తర్వాత బ్యాలెన్స్‌ కోల్పోవడం వల్ల బౌండరీ దాటింది. అంతకుముందే బంతిని గాల్లోకి విసరడం, అది కిందపడేలోపే మళ్లీ మైదానంలోకి ఎగురుతూ బంతిని అందుకోవడం అంతా రెప్పపాటులో జరిగిపోయాయి. అది రీప్లేలో చూసిన వారంతా హర్లీన్‌ క్యాచ్‌కు మంత్రముగ్ధులయ్యారు. దాంతో అమీజోన్స్‌ పెవిలియన్‌ బాటపట్టక తప్పలేదు. ఆ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారడం వలల్ అందరూ టీమ్‌ఇండియా క్రికెటర్‌ను మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే పలువురు ప్రముఖులు కూడా హర్లీన్‌ను అభినందిస్తూ ఇలా ట్వీట్లు చేశారు.

"హర్లీన్‌ నువ్వు పట్టిన ఈ క్యాచ్‌ అద్భుతమైనది. నాకైతే ఇది కచ్చితంగా 'క్యాచ్‌ ఆఫ్‌ ది ఇయర్‌'గా అనిపిస్తోంది."

- సచిన్‌ తెందుల్కర్‌

"గతరాత్రి హర్లీన్‌ చేసిన ఈ విన్యాసాన్ని కళ్లారా చూశాను. చురుగ్గా స్పందించడమే కాకుండా గొప్ప విన్యాసాలు ప్రదర్శించింది. ఈ క్రెడిట్‌ ఫీల్డింగ్‌ కోచ్‌ అభయ్‌శర్మకు కూడా దక్కుతుంది."

- మిథాలి రాజ్‌

" హర్లీన్‌ నీ క్యాచ్‌కు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఇదెంతో అద్భుతంగా ఉంది. మున్ముందు కూడా ఇలాగే రాణించాలని ఆశిస్తున్నా."

- హర్భజన్‌ సింగ్‌

"క్రికెట్‌ మైదానంలో హర్లీన్‌ పట్టిన ఈ మేటి క్యాచ్‌ను ప్రతిఒక్కరూ ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఇది కచ్చితంగా టాప్‌క్లాస్‌ ప్రదర్శన. "

- వీవీఎస్‌ లక్ష్మణ్‌

"ఇది నమ్మశక్యం కానిది. కచ్చితంగా జరిగి ఉండదు. ఏదైనా జిమ్మిక్కులు చేసి ఉండొచ్చు.. ఏంటీ? అది నిజంగా జరిగిందా? సరే అయితే.. ఆమె నిజమైన వండర్‌ ఉమెన్‌."

- ఆనంద్‌ మహీంద్ర.

"టీమ్‌ఇండియా మహిళా క్రికెటర్లు కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. హర్లీన్‌కు మరింత శక్తి సామర్థ్యాలు చేకూరాలి."

- స్మృతి ఇరాని

"ఇదెంతో అద్భుతంగా ఉంది. మహిళలు ఎంతో నైపుణ్యంకలవారు."

- ప్రియాంక గాంధీ

"ఇదెంతో అమోఘమైన ప్రదర్శన. వెల్‌డన్‌ హర్లీన్‌"

- శివ్‌రాజ్‌ సింగ్‌ చౌహన్‌

"ఈరోజు ఆటలో ఫలితం అనుకూలంగా రాకపోయినా ఇది మాత్రం ప్రత్యేకమైనది."

- మహిళల బీసీసీఐ

"ఇది టీమ్‌ఇండియా మహిళా జట్టు నుంచి అద్భుతమైన ప్రదర్శన."

- ఐసీసీ

" ఇది టీమ్‌ఇండియా నుంచి అద్భుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన."

- ఇంగ్లాండ్‌ మహిళల జట్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.