విరాట్ కోహ్లీ కెరీర్ ఆరంభంలో తనకు పాదాభివందనం చేయబోతే వారించిన ఆసక్తికర ఉదంతాన్ని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ గుర్తు చేసుకున్నాడు. ఓ ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడాడు.
"విరాట్ జట్టులోకి వచ్చిన కొత్తలో నా దగ్గరికి వచ్చి నా పాదాలను తాకబోయాడు. నాకు ఏం జరుగుతోందో అర్థం కాలేదు. ఏం చేస్తున్నావంటూ అతణ్ని వారించా. అతను పైకి లేచి దూరంగా ఉన్న సహచర ఆటగాళ్ల వైపు చూశాడు. వాళ్లు గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు."
-సచిన్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
జట్టులోకి ఏ కొత్త ఆటగాడు వచ్చినా సచిన్‌కు పాదాభివందనం చేయాలంటూ యువరాజ్, ఇర్ఫాన్ తదితరులు చెప్పడం వల్ల విరాట్ ఇలా చేశాడట. అలాగే పాక్ పేసర్ షోయబ్ అక్తర్‌కు బంతి తాకి పక్కటెముకలకు గాయం కావడం వల్ల 2007లో రెండు నెలలు బాధపడ్డానని సచిన్ గుర్తు చేసుకున్నాడు. ‘
"2007లో పాకిస్థాన్‌తో భారత్‌లో వన్డే మ్యాచ్ సందర్భంగా అక్తర్ బంతి పక్కటెముకలకు బలంగా తగిలింది. రెండు నెలల పాటు కనీసం దగ్గలేకపోయా. ఆటను మాత్రం కొనసాగించా. సొంతంగా చెస్ట్ గార్డ్‌ను డిజైన్ చేసుకున్నా. పాక్‌తో మిగతా నాలుగు వన్డేలు, టెస్టు సిరీస్ ఆడా. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లా" అని సచిన్ చెప్పాడు.