ETV Bharat / sports

Rohit Virat vs Pakistan : పాకిస్థాన్​ అనగానే వీరికి పూనకాలే.. దాయాదికి పీడకలలు మిగిల్చిన రోహిత్ - విరాట్ ద్వయం - rohit vs pakistan odi

Rohit Virat vs Pakistan : మరి కొద్దిసేపట్లో మెగాటోర్నీలో భారత్-పాక్ సమరం ప్రారంభం కానుంది. గతంలో ఈ మెగాటోర్నీలో రెండు జట్లు తలపడిన సందర్భాల్లో 2015లో విరాట్, 2019లో రోహిత్ శర్మ సెంచరీలు సాధించారు. అయితే శనివారం నాటి మ్యాచ్​లో వీరిద్దరూ ఓకేసారి సెంచరీ బాదితే పాకిస్థాన్ బౌలర్లకు చుక్కలేనని ఫ్యాన్స్ అంటున్నారు. మరి దాయాది దేశంపై వీరిద్దరి గణాంకాలపై ఓసారి లుక్కేద్దామా?

Rohit Virat vs Pakistan
Rohit Virat vs Pakistan
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 14, 2023, 12:59 PM IST

Updated : Oct 14, 2023, 1:29 PM IST

Rohit Virat vs Pakistan : 2023 వరల్డ్​కప్​లో హైవోల్టేజ్​ మ్యాచ్​కు రంగం సిద్ధమైంది. కొన్ని గంటల్లోనే మ్యాచ్ ప్రారంభం కానుంది. వన్డే ప్రపంచకప్​ హిస్టరీలో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్​ల్లో పాకిస్థాన్​పై టీమ్ఇండియాదే పైచేయి. దీంతో ఈ మ్యాచ్​లోనూ భారత్.. జైత్రయాత్రను కొనసాగించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే ఈ మ్యాచ్​లో ముఖ్యంగా అందరి ఫోకస్ స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పైనే ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఆయా ఐసీసీ ఈవెంట్లలో, టోర్నీల్లో భారత్-పాక్​ మ్యాచ్​ల్లో వీరిద్దరూ కీలక పాత్ర పోషించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

రోహిత్ శర్మ.. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ గణాంకాలు పాకిస్థాన్​పై మెరుగ్గా ఉన్నాయి. అతడు పాకిస్థాన్​పై వన్డేల్లో ఇప్పటివరకూ 18 ఇన్నింగ్స్​లు ఆడాడు. అందులో రెండు సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు సహా.. 52.76 సగటుతో 786 పరుగులు చేశాడు. 2019 వరల్డ్​కప్​లోనూ పాక్​పై అద్భుత సెంచరీతో కదం తొక్కాడు. ఆ మ్యాచ్​లో రోహిత్ 140 పరుగులు చేసి పాక్ బౌలర్లను శాసించాడు.

ఇక గత నెలలో జరిగిన 2023 ఆసియా కప్​లోనూ రోహిత్​ పాక్​పై చెలరేగిపోయాడు. తొలి మ్యాచ్​లో స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా.. సూపర్ 4లో మాత్రం మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. 49 బంతుల్లోనే 4 సిక్స్​లు, 6 ఫోర్లతో 56 పరుగులు చేశాడు. ఇక శనివారం నాటి మ్యాచ్​లో కూడా రోహిత్​ చెలరేగితే భారత్​కు భారీ స్కోర్ ఖాయమని ఫ్యాన్ అంటున్నారు.

విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. పాక్​ అంటే ఏ విధంగా చెలరేగిపోతాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2012 ఆసియా కప్​లో మొదలుకొని.. 2013 ఆసియా కప్​, 2016, 2022 టీ20 వరల్డ్​కప్​ల్లో పాక్​ బౌలర్లకు విరాట్ పీడకలలు మిగిల్చాడు. 2015 వరల్డ్​కప్​లో ఏకంగా సెంచరీ (107) బాదేసి టీమ్ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.

అదే ఫామ్​ను కొనసాగిస్తూ.. 2019 వరల్డ్​కప్​లోనూ అద్భుతమైన హాఫ్ సెంచరీ (77) నమోదు చేశాడు. ఇక రీసెంట్​గా జరిగిన ఆసియా కప్​ సూపర్​ 4లోనూ 122 పరుగులతో కదం తొక్కాడు. సోషల్ మీడియాలో కూడా పాకిస్థాన్​తో మ్యాచ్​ అనగనే.. ఎన్నోసార్లు విరాట్ వారిపై ఆడిన ఇన్నింగ్స్​నే గుర్తుచేసుకుంటారు ఫ్యాన్స్​. విరాట్ ఇప్పటివరకూ పాక్​పై 15 ఇన్నింగ్స్​ల్లో 55.16 సగటుతో 662 పరుగులు చేశాడు. అందులో 3 శతకాలు, 2 అర్ధ శతకాలు ఉన్నాయి.

  • Congratulations to #TeamIndia for their impeccable performance, securing two wins in two matches at the #CWC2023! Special appreciation to our captain @ImRo45 for his remarkable achievement - a record-breaking century, the fastest by an Indian in World Cup history! 🙌

    Not only… pic.twitter.com/6i8sNXmLRE

    — Jay Shah (@JayShah) October 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Stage is set for the greatest rivalry India vs Pakistan.
    Come on Men In Blue 💙🇮🇳.
    2015 WC- Virat Kohli scored hundred against Pakistan.
    2019 WC- Rohit scored hundred against Pakistan.
    2023 WC- ?
    I want a close match and want Virat Kohli recreate the 28 of 8 like situation in… pic.twitter.com/hGQJBVROCI

    — Ranit Sarkar (@iam_ranit) October 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Rohit Sharma smashed a brilliant hundred when India vs Pakistan meet last time in World Cup....!!!

    - Hitman has the highest score in India vs Pakistan history in World Cups.pic.twitter.com/MDQcKCb3qc

    — Johns. (@CricCrazyJohns) October 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Rohit Sharma World Cup 2023 : 'బౌలర్లు బీ కేర్​ ఫుల్​.. అక్కడుంది రోహిత్ శర్మ'

Ind VS Pak World Cup 2023 : బిగ్​ఫైట్​కి రంగం సిద్ధం.. భారత్​-పాక్ మధ్య భీకర పోరు.. గెలుపెవరిదో?

Last Updated : Oct 14, 2023, 1:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.