ETV Bharat / sports

తొలిసారిగా మహిళా అంపైర్ల అరంగేట్రం.. బీసీసీఐ అవకాశంతో..! - జనని నారాయణన్‌ మహిళా అంపైర్​

చరిత్రలో ఎన్నడు లేని విధంగా ఓ అరుదైన వృత్తిలోకి చేరారు ముగ్గురు నారీమణులు. క్రికెట్​పై మక్కువతో కష్టసాధ్యమైన పని అని తెలిసినా పట్టుదలతో వివిధ దశలు దాటి ఎట్టకేలకు మహిళలు కూడా అంపైర్లుగా వ్యవహరించొచ్చని నిరూపించారు. ఇందుకు దేశంలో జరుగుతున్న రంజీ ట్రోఫీ వేదికైంది​. రంజీ ట్రోఫీ మ్యాచ్​లో మహిళా అంపైర్లుగా అరంగేట్రం చేసి సరికొత్త రికార్డును నెలకొల్పారు.

Three Woman Umpires
Woman Umpires
author img

By

Published : Jan 11, 2023, 10:19 AM IST

కొన్ని వృత్తులు కేవలం పురుషుల కోసమనే ధోరణిలో ఉంటారు కొందరు. కానీ వారికి మాత్రమే అనుకునే పలు వృత్తుల్లో మహిళలు సైతం రాణిస్తున్నారు. విహంగాలు నడిపే పైలట్లుగా, రైళ్లు నడిపే లోకోపైలట్లుగా ఆఖరికి బస్సు డ్రైవర్ల అవతారమూ ఎత్తుతున్నారు నేటి నారీమణులు. ఇక తాజాగా చరిత్రలో ఎన్నడు లేని విధంగా క్రీడా రంగంలోని గౌరవప్రదమైన హోదాలో చేరారు ఈ ముగ్గురు సఖులు. ఇంతకీ వీరు చేరిన వృత్తి ఎంటనుకుంటున్నారా.. అదేనండి మహిళా క్రికట్​ అంపైర్ విధుల్లో చేరారు​.. వారే వృందా రాఠి, జనని నారాయణన్‌, గాయత్రి వేణుగోపాలన్‌. మహిళా అంపైర్లుగా మారి చరిత్ర సృష్టించారు.

మంగళవారం ప్రారంభమైన రంజీ మ్యాచ్‌ల్లో ఈ ముగ్గురు అంపైర్లుగా బాధ్యతలు నిర్వర్తించారు. ఝార్ఖండ్‌, చత్తీస్‌గఢ్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో గాయత్రి, రైల్వేస్‌, త్రిపురల మధ్య పోరులో జనని, గోవా, పాండిచ్చేరి మ్యాచ్‌లో వృందా అంపైర్లుగా బాధ్యతలు ప్రారంభించారు. సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని అయిన జననికి క్రికెట్‌ అంటే ఎంతో ఇష్టం. తాను అంపైర్‌ కావాలనుకుంటున్నట్లు తమిళనాడు క్రికెట్‌ సంఘం(టీఎన్‌సీఏ) కు పలు మార్లు విజ్ఞప్తి చేసింది. కొన్నేళ్ల తర్వాత టీఎన్‌సీఏ నిబంధనలను మార్చి మహిళలకూ అవకాశం కల్పించింది. 2018లో బీసీసీఐ లెవెల్‌-2 పరీక్షలో ఉత్తీర్ణీత సాధించిన జనని. 2021లో తమిళనాడు ప్రిమియర్‌ లీగ్‌లో అంపైర్‌గా విధులు నిర్వర్తించింది. ముంబయి మైదానాల్లో స్థానిక మ్యాచ్‌లకు స్కోరర్‌గా వ్యవహరించిన వృందా.. 2013 మహిళల ప్రపంచకప్‌లో బీసీసీఐ స్కోరర్‌గా పనిచేసింది. అనంతరం అంపైరింగ్‌కు మారింది. క్రికెటర్‌ కావాలనుకున్న గాయత్రి.. భుజం గాయం కారణంగా నిర్ణయం మార్చుకుంది. 2019లో బీసీసీఐ అంపైర్‌గా తన కెరీర్‌ మొదలుపెట్టింది.

ఇక ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా అంపైర్​గా క్లైర్ పోలోసాక్ చరిత్రకెక్కారు. ఆస్ట్రేలియా క్రీడాకారిణి అయిన ఈమె పురుషుల టెస్టు మ్యాచ్‌లో తొలి మహిళా అంపైర్​ అవతారము ఎత్తారు. పోలోసాక్ సిడ్నీ టెస్టులో నాల్గవ అంపైర్ పాత్రను చేపట్టింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.