ETV Bharat / sports

2024 రంజీలో బ్యాటర్లు అదరహో- అందరి టార్గెట్ అదే!

Ranji Trophy 2024: 2024 రంజీ ట్రోఫీలో భారత ప్లేయర్లు అదరగొడుతున్నారు. కొందరు కుర్రాళ్లు టీమ్ఇండియాలో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా ఆడితే, పుజారా లాంటి సీనియర్లు జట్టులో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సెలక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. మరి ప్రస్తుత రంజీలో ఇప్పటివరకు నమోదైన అత్యుత్తమ ప్రదర్శనలు ఇవే!

ranji trophy 2024
ranji trophy 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 8, 2024, 9:21 PM IST

Updated : Jan 8, 2024, 10:03 PM IST

Ranji Trophy 2024: భారత క్రికెటర్లు జాతీయ జట్టులోకి ఎంట్రీ లేదా రీ ఎంట్రీ ఇవ్వాలంటే డొమెస్టిగ్​లో ప్రదర్శనల్నే పరిగణలోకి తీసుకుంటారు. ఆయా టోర్నీల్లో వారి పెర్ఫార్మెన్స్​లు బట్టి టీమ్ఇండియాలోకి ఎంపిక చేస్తారు సెలక్టర్లు. ఐపీఎల్​, రంజీ ట్రోఫీ, విజయ్​ హరారే లాంటి టోర్నీలు ఆ లిస్ట్​లో ఉంటాయి. టీమ్ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్న ప్రతి ప్లేయర్ అందులో సత్తా చాటి సెలక్టర్లు దృష్టిని ఆకర్షిస్తారు. అలా ప్రస్తుతం జరగుతున్న 2024 రంజీ ట్రోఫీలో భారత్ ప్లేయర్లు అదరగొడుతున్నారు. అందులో కొందరూ ఇప్పిటికే టీమ్ఇండియాలో ఉండాగా, మరికొందరు జాతీయ జట్టులోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి ఈ టోర్నీలో అత్యుత్తమంగా రాణిస్తున్న వారు ఎవరంటే?

ఛెతేశ్వర్ పుజారా: టీమ్ఇండియా నయావాల్ ఛెతేశ్వర్ పుజారా ఇటీవల టెస్టు జట్టులో చోటు కోల్పోయాడు. అయితే మళ్లీ టీమ్ఇండియాలో రీ ఎంట్రీయే లక్ష్యంగా పుజారా తాజా రంజీ ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆడిన తొలి మ్యాచ్​లోనే డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. సౌరాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా, ఝార్ఖండ్​పై 243 భారీ ఇన్నింగ్స్​తో ఆకట్టుకున్నాడు.

దేవదత్ పడిక్కల్: టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ కర్ణాటక తరఫున ఆడుతున్నాడు. అతడు పంజాప్​పై మ్యాచ్​లో 193 పరుగులు బాదాడు. తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు.

తిలక్ వర్మ: హైదరాబాద్​ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తిలక్ వర్మ, నాగాలాండ్​పై సెంచరీతో చెలరేగాడు. 112 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్​లతో తిలక్ 100 పరుగులు చేలి నాటౌట్​గా నిలిచాడు. ఫలితంగా హైదరాబాద్​ 194 పరుగుల తేడాతో నెగ్గింది. కాగా, జనవరి 11 నుంచి అఫ్గానిస్థాన్​తో జరిగే టీ20 సిరీస్​కు తిలక్ ఎంపికయ్యాడు.

రియాన్ పరాగ్: టీమ్ఇండియాలో స్థానమే లక్ష్యంగా ఆడుతున్నాడు రియాన్ పరాగ్. అసోం జట్టుకు కెప్టెన్​గా వ్యవహరిస్తున్న రియాన్, ఛత్తీస్​దఢ్​పై అద్భుత సెంచరీ నమోదు చేశాడు. కేవలం 56 బంతుల్లోనే అతడు 100 పరుగుల మార్క్​ అందుకున్నాడు. ఈ మ్యాచ్​లో రియాన్ 87 బంతుల్లోనే 155 పరుగులు చేసి సత్తా చాటాడు.

ఈ టోర్నీలో వీళ్లే కాకుండా ప్రభ్​సిమ్రన్ సింగ్ (100), ప్రియమ్ గార్గ్ (106), మనీశ్ పాండే (118), రికీ భుయ్ (175), ప్రేరక్ మన్కడ్ (104), అంకిత్ భవానే (153), సిద్ధార్థ్ కే వీ (151), ఆర్యన్ జుయల్ (115) సెంచరీతో అదరగొట్టారు.

టీమ్ఇండియాకు దూరం - రంజీలో టాప్​ - శతకంతో సెలక్టర్లకు కౌంటర్​

అన్నకు తగ్గ తమ్ముడు - రంజీలో రాణిస్తున్న షమీ సోదరుడు

Last Updated : Jan 8, 2024, 10:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.