Ranjji Trophy 2022: రంజీ ట్రోఫీ లీగ్ దశను ఫిబ్రవరి 16 నుంచి మార్చి 5 వరకు నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. జనవరి 13 నుంచి ప్రారంభం కావాల్సిన ఈ ట్రోఫీ.. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వాయిదా పడింది. ఇప్పుడు దేశంలో పరిస్థితులు మెరుగుపడుతున్న నేపథ్యంలో దేశీవాళీ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది.
టోర్నీలో ఈసారి ఒక్కో గ్రూపులో ఆరు జట్లు ఉండగా.. ఆ సంఖ్యను నాలుగుకు కుదించి ఎనిమిది గ్రూపులకు పెంచారు. ఈ ట్రోఫీని.. అహ్మదాబాద్, కోల్‌కతా, త్రివేండ్రం, కటక్, చెన్నై, గువాహటి, హైదరాబాద్, బరోడా, రాజ్‌కోట్ వేదికల్లో నిర్వహించనున్నట్లు బిసీసీఐ వర్గాలు తెలిపాయి. దీన్ని బట్టి తొమ్మిది వేర్వేరు బయో బబుల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
రంజీ ట్రోఫీని రెండు దశల్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జైషా ఇప్పటికే చెప్పారు. దీని ప్రకారం.. రెండో దశను జూన్‌లో జరపనున్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: భారత గోల్‌కీపర్ శ్రీజేష్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డు